పెద్దపల్లిలో విషాదం... కన్నతల్లి వర్థంతి రోజు కూతురు మృతి

By Arun Kumar PFirst Published May 25, 2023, 2:43 PM IST
Highlights

తల్లి వర్థంతి కార్యక్రమంలో పాల్గొని నివాళి అర్పిస్తూ ఒక్కసారిగా కుప్పకూలి ఓ వైద్యురాలు మృతిచెందింది. 

పెద్దపెల్లి : తల్లి ప్రథమ వర్థంతి రోజునే కూతురు మృతిచెందిన విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. తల్లి చిత్రపటానికి నివాళి అర్పిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇలా అప్పటికే బాధలో వున్న కుటుంబంలో మరో విషాదం ఏర్పడింది. 

పెద్దపల్లి పట్టణానికి చెందిన అవునూరి శ్రీహరి, మహాలక్ష్మి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు సంతానం. పిల్లలందరికీ పెళ్లిళ్లయి వారి వారి  కుటుబాలతో జీవిస్తున్నారు. అయితే వృద్దాప్యంతో గతేడాది మహాలక్ష్మి మృతిచెందగా నిన్న(బుధవారం) ప్రథమ వర్ధంతి నిర్వహించారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో శ్రీహరి పిల్లలందరితో పాటు బంధువులు, మిత్రులు కూడా పాల్గొన్నారు. 

అయితే మహాలక్ష్మి చిత్రపటం వద్ద నివాళి అర్పించే క్రమంలో పెద్దకూతురు అనురాధ(51) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను కుటుంబసభ్యులు సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే అనురాధ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. 

Read More  హృదయవిధారక ఘటన... కన్న కూతురు పెళ్లిలోనే కుప్పకూలి తండ్రి మృతి

మృతురాలు అనురాధ భర్త రాజ్ కుమార్ తో కలిసి భువనగిరి పట్టణంలో హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం. అందరూ కలిసి మహాలక్ష్మి వర్ధంతి కార్యక్రమానికి వెళ్లగా అక్కడే డాక్టర్ అనురాధ మృతిచెందడంతో ఆ కుటుంబంలో మరింత విషాదాన్ని నింపింది. 

click me!