దాసోజు శ్రవణ్ కుమార్ బీజేపీలో చేరారు. రెండు రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.
హైదరాబాద్: రెండు రోజుల క్రితం Congress పార్టీకి రాజీనామా చేసిన Dasoju Sravan Kumar బీజేపీలో చేరారు. టీపీసీసీ చీఫ్ Revanth Reddy తీరుపై తీవ్ర విమర్శలు చేసిన శ్రవణ్ BJP తీర్ధం పుచ్చుకొున్నారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ Tarun Chugh సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి Kishan Reddy దాసోజు శ్రవణ్ కు కాషాయ కండువా కప్పారు. దాసోజు శ్రవణ్ ను ఎంపీ , బీజేపీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తరుణ్ చుగ్ వద్దకు తీసుకెళ్లారు.
undefined
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీనవర్గాలకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని శ్రవణ్ విమర్శించారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకొన్ను పరిణామాలపై తాను దగ్గరుంది పరిశీలించిన తర్వాత అసంతృప్తితో తాను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు దాసోజు శ్రవణ్.
గత అసెంబ్లీ ఎన్నికల్లో khairatabad Assembly స్థానం నుండి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఇటీవల కాలంలో ఖైరతాబాద్ కార్పోరేటర్ పి. విజయా రెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. P.Vijaya Reddy కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై దాసోజు శ్రవణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పి. విజాయారెడ్డికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ అసెంబ్లీ టికెట్ ఇవ్వనుందనే ప్రచారం సాగుతుంది. పి. విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోన్న రోజు నుండి గాంధీ భవన్ కు దాసోజు శ్రవణ్ దూరంగా ఉన్నారు. ఆ తర్వాత శ్రవణ్ కుమార్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. అప్పుడప్పుడూ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి మీడియా సమావేశాలు నిర్వహించారు.
దాసోజు శ్రవణ్ తొలుత PRP లో పనిచేశారు. తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో శ్రవణ్ పీఆర్పీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. 2014 లో శ్రవణ్ టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ లో ఉన్న సమయంలో కూడా ఖైరతాబాద్ అసెంబ్లీ టికెట్ ను ఆశించారు. కానీ ఖైరతాబాద్ టికెట్ ను టీఆర్ఎస్ కేటాయించలేదు. దీంతో శ్రవణ్ టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో శ్రవణ్ బీజేపీలో చేరారు.
also read:రేవంత్‌తో సునీల్, ఠాగూర్ కుమ్మక్కు... ఫ్రాంఛైజీలా టీపీసీసీ, కాంగ్రెస్‌లో వుండలేను : దాసోజు శ్రవణ్
తెలంగాణలో దాసోజు శ్రవణ్ చేరిక ఆరంభం మాత్రమేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. తమ పార్టీలో త్వరలోనే భారీ ఎత్తున చేరికలు ఉండే అవకాశం ఉందని బీజేపీ నేతలు ప్రకటించారు. ఈ నెల 21న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. మరో 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని కూడా బీజేపీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కమల దళం వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది.