Basara IIIT: మరీ దారుణం... కిచెన్ ని బాత్రూమ్ గా మార్చేశారు గా...!

Published : Aug 07, 2022, 09:10 AM IST
Basara IIIT: మరీ దారుణం... కిచెన్ ని బాత్రూమ్ గా మార్చేశారు గా...!

సారాంశం

వంటలు చేసే పాత్రలు పక్కనే ఉండగా.. వాటి పక్కనే వీరు స్నానాలు చేయడం గమనార్హం. వారు ఇలా స్నానం చేయడం మొదటి సారి కాదని.. వారు రోజూ అలానే చేస్తూ ఉన్నారని తేలడం గమనార్హం.  

బాసర ట్రిపుల్ ఐటీ లో దారుణం బయటపడింది. సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరుకు అద్దం పట్టేలా ఓ వీడియో బయటకు వచ్చింది. విద్యార్థులకు శుద్దిగా వండి పెట్టాల్సిన కిచెన్ ని బాత్రూమ్ గా మార్చేశారు.  కిచెన్ లో ఏకంగా స్నానాలు చేశారు. భండార్ మెస్ లో.. సిబ్బంది స్నానాలు చేస్తుండగా.. కొందరు వీడియో తీయగా.. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ గా మారాయి. వీడియోతో అక్కడి భండారం బయటకు వచ్చింది.

ఆ వీడియోని విద్యార్థులే రికార్డు చేసినట్లు తెలుస్తోంది. వంటలు చేసే పాత్రలు పక్కనే ఉండగా.. వాటి పక్కనే వీరు స్నానాలు చేయడం గమనార్హం. వారు ఇలా స్నానం చేయడం మొదటి సారి కాదని.. వారు రోజూ అలానే చేస్తూ ఉన్నారని తేలడం గమనార్హం.

 

ఈ వీడియోని విద్యార్థులు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ గా మారింది. వీడియో చూసినవారంతా మెస్ సిబ్బందిపై విమర్శలు చేస్తున్నారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే.. ఇలా మెస్ లో స్నానాలు చేయడం వల్లే అలా జరిగిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఆగస్టు 3 వ తేదీన పోస్టు చేయడం గమనార్హం. ‘ కిచెన్ లో స్నానం చేస్తున్నారా లేక.. బాత్రూమ్ లో వంట చేస్తున్నారా? ఎవరైనా క్లారిటీ ఇస్తారా?’ అంటూ ఈ వీడియోని పోస్టు చేయడం గమనార్హం.

ప్రస్తుతానికి ఈ కిచెన్ లో స్నానాల వీడియో.. తీవ్ర దుమారమే రేపుతోంది. మరి దీనిపై సిబ్బంది ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?