ఆ అట్టముక్కలతో బ్లాస్ట్ ఆలస్యం, ఉగ్రవాదుల టార్గెట్ మిస్: దర్బాంగా ఘటనలో కీలక విషయాలు

By narsimha lodeFirst Published Jul 6, 2021, 10:21 AM IST
Highlights

: దర్భాంగా రైల్వే స్టేషన్ లో పేలుడు ఘటనపై ఎన్ఐఏ అధికారులు హైద్రాబాద్ కేంద్రంగా విచారణ జరుపుతున్నారు. నాసిర్, ఇమ్రాన్ సోదరులను బీహార్ నుండి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో ఎన్ఐఏ కీలక విషయాలను గుర్తించింది.

హైదరాబాద్: దర్భాంగా రైల్వే స్టేషన్ లో పేలుడు ఘటనపై ఎన్ఐఏ అధికారులు హైద్రాబాద్ కేంద్రంగా విచారణ జరుపుతున్నారు. నాసిర్, ఇమ్రాన్ సోదరులను బీహార్ నుండి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో ఎన్ఐఏ కీలక విషయాలను గుర్తించింది.

దర్బాంగా పేలుడు ఘటనకు  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వచ్చిన పార్శిల్ కారణంగా  అధికారులు గుర్తించారు. ఈ దిశగా విచారణ జరిపిన సమయంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ బ్లాస్ట్‌కు ప్లాన్ చేశారని గుర్తించారు.రన్నింగ్ ట్రైన్ లో పేలుడు జరిగేలా ఇమ్రాన్, నాసిర్ సోదరులు ప్లాన్ చేశారు. అయితే పేలుడు పదార్ధాల అమర్చడంలో చేసిన పొరపాటుతో ఉగ్రవాదులు తాము నిర్ధేశించుకొన్న లక్ష్యానికి చేరుకోలేకపోయారు.పేలుడు కోసం సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, వైట్ షుగర్ లను ఉపయోగించారు. ఈ మూడు కలిస్తే పేలుడు వాటిల్లుతుంది. పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది ఇక్బాల్  ఆదేశాల మేరకు పేలుడు పదార్ధాలను తయారు చేశారు.

సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, వైట్ షుగర్ ల మధ్య చిన్న పేపర్ ముక్కలను వాడాల్సి ఉంది. ఈ మూడింటి మధ్య పేపర్ ముక్క వాడితే ట్రయల్స్ సమయంలో వీరు సక్సెస్ కాలేదు.  దీంతో  రైల్వే స్టేషన్ లో పంపే పార్శిల్ లో ఈ మూడు రసాయనాల మధ్య అట్టముక్కలు ఉపయోగించారు.

also read:దర్బాంగా బ్లాస్ట్: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్ లో ఎన్ఐఏ విచారణ, కీలక ఫైల్స్ స్వాధీనం

అయితే ఈ మూడు రసాయనాల మధ్య అట్టముక్కలు ఉన్న కారణంగా ఇవి కలవడానికి చాలా సమయం పట్టింది. దీంతో రైలు రన్నింగ్ సమయంలో పేలుడు వాటిల్లలేదు. దర్భాంగ రైల్వేస్టేషన్ లో రైలు నిలిచిపోయిన సమయంలో  బ్లాస్ట్ చోటు చేసుకొందని  ఎన్ఐఏ గుర్తించింది.  నిందితుల విచారణలో  కీలక విషయాలను ఎన్ఐఏ సేకరించింది. మరోవైపు బ్లాస్ట్ కోసం నిందితులు ఎక్కడెక్కడ ఏం కొనుగోలు చేశారు, ఎలా పార్శిల్ బాంబు తయారు చేశారనే విషయాలపై ఎన్ఐఏ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయనుంది.


 

click me!