హైద్రాబాద్ మహిళలకు గుడ్‌న్యూస్: చెయ్యెత్తిన చోట ఆర్టీసీ బస్సు నిలుపుదల

By narsimha lodeFirst Published Jul 6, 2021, 9:29 AM IST
Highlights

మహిళలకు హైద్రాబాద్ ఆర్టీసీ  గుడ్ న్యూస్ చెప్పింది. రాత్రి ఏడున్నర గంటలు దాటిన తర్వాత ఎక్కడైనా సరే చెయ్యెత్తి బస్సును ఆపవచ్చని తెలిపింది. 
 

హైదరాబాద్: మహిళలకు హైద్రాబాద్ ఆర్టీసీ  గుడ్ న్యూస్ చెప్పింది. రాత్రి ఏడున్నర గంటలు దాటిన తర్వాత ఎక్కడైనా సరే చెయ్యెత్తి బస్సును ఆపవచ్చని తెలిపింది. ఈ మేరకు గ్రేటర్ హైద్రాబాద్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయమైనగరంలోని అన్ని ఆర్టీసీ బస్సు డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశామని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. రాత్రి పూట తాము కోరుకొన్న చోట బస్సును దిగి వెళ్లిపోయే అవకాశాన్ని ఆర్టీసీ కల్పించింది. హైద్రాబాద్  నగరంలోని 29 డిపోలకు చెందిన  బస్సుల్లో మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఆర్టీసీ తెలిపింది. 

బస్టాపుల్లో మహిళలు  ఎక్కువ సమయం వేచి ఉండకుండా బస్సు కోసం ప్రత్యేకంగా బస్టాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ అవకాశం కల్పించినట్లు ఆచ్టీసీ అధికారులు తెలిపారు. మహిళా ప్రయాణికులు కోరిన చోట బస్సు ఆపకపోతే డిపో మేనేజర్‌లకు ఫిర్యాదు చేసే వెసులుబాటును ఆర్టీసీ ప్రకటించింది.ఈ  మేరకు అన్ని బస్సుల్లో డిపో మేనేజర్ల ఫోన్‌ నంబర్లను అందుబాటులో ఉంచనున్నట్లు ఈడీ  చెప్పారు. ప్రధానమైన బస్టాపుల్లో రాత్రి 10 గంటల వరకు బస్సుల రాకపోకలు కొనసాగించేలా అధికారులు ప్లాన్ చేశారు. 
 

click me!