నిరుద్యోగులే టార్గెట్... రైల్వే జాబ్స్ పేరిట మోసాలు...ఇద్దరు నిందితులు అరెస్ట్

By Arun Kumar PFirst Published Jul 6, 2021, 10:04 AM IST
Highlights

నిరుద్యోగ యువతను మోసం చేయగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్న ఇద్దరు నిందితులను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

కరీంనగర్: అమాయక నిరుద్యోగ యువతే వారి టార్గెట్. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేస్తారు. ఇలా నిరుద్యోగ యువతను మోసం చేయగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తారు. ఆ డబ్బులు అయిపోయాక మరో నిరుద్యోగి టార్గెట్. ఇలా యువతను టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

వివరాల్లోకి వెళితే... వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వరికిల్ల శ్రీనివాస్, మంద శ్రీకాంత్ జల్సాలకు అలవాటు పడ్డారు. ఈజీ మనీ కోసం నిరుద్యోగ యువతకు ఉద్యోగాల పేరిట మోసం చేసేవారు. రైల్వే డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు పెట్టిస్తామని నమ్మిస్తూ అమాయక యువతను మోసం చేస్తున్నారు. 

read more  తప్పుడు బిల్లులతో రూ. 1.20 కోట్లు డ్రా:నీలోఫర్ డైట్ కాంట్రాక్టర్ సురేష్ బాబు అరెస్ట్

ఇలా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మనగుర్తి గ్రామానికి చెందిన అందే అజయ్ అనే యువకున్ని కూడా రైల్వే ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు. అతడి నుండి రూ74,000/- రూపాయలు తీసుకొని ఉద్యోగం పెట్టించకుండా రేపు మాపు అని నమ్మిస్తూ కాలక్షేపం చేయసాగారు. దీంతో అనుమానం వచ్చిన అతడు తన డబ్బులు తిరిగివ్వాలని నిలదీయడంతో డబ్బులు ఇచ్చేస్తామని బాండ్ పేపర్ కూడా రాసాచ్చారు. అయినా డబ్బులు ఇవ్వకపోవడంతో యువకుడు సైదాపూర్ పోలీసులను ఆశ్రయించగా ఈ మోసం బయటపడింది. 

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితులు రైల్వే ఉద్యోగాల పేరుతో కేవలం అజయ్ నే కాదు మరికొంత మందిని కూడా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులిద్దరినీ చాకచక్యంగా అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు. 

 

click me!