దర్బాంగా రైల్వేస్టేషన్ పేలుడు ఘటన: మూడో వ్యక్తి ప్రమేయంపై హైద్రాబాద్‌లో ఎన్ఐఏ సెర్చ్ ఆపరేషన్

By narsimha lodeFirst Published Jul 1, 2021, 10:19 AM IST
Highlights

బీహార్ రాష్ట్రంలోని దర్బాంగా రైల్వేస్టేషన్ లో పేలుడు ఘటనలో  మరో వ్యక్తి కూడ ఉన్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. ఈ వ్యక్తికి కూడ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ అనుమానిస్తుంది.  

హైదరాబాద్: బీహార్ రాష్ట్రంలోని దర్బాంగా రైల్వేస్టేషన్ లో పేలుడు ఘటనలో  మరో వ్యక్తి కూడ ఉన్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. ఈ వ్యక్తికి కూడ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ అనుమానిస్తుంది.  హైద్రాబాద్ పోలీసుల సహకారంతో ఎన్ఐఏ అధికారులు నగరంలో సెర్చ్ ఆపరేషన్స్ చేపట్టారు. దర్బాంగా రైల్వేస్టేషన్ పేలుడు ఘటనలో   ఇప్పటికే  హైద్రాబాద్ లో ఇమ్రాన్, నసీర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ రాష్ట్రానికి చెందిన వీరిద్దరూ హైద్రాబాద్ లో  రెడీమెడ్ దుస్తుల వ్యాపారం నిర్వహించేవారు. 

also read:రైలు పేల్చేందుకు కుట్ర: దర్భాంగా పేలుడులో కీలక విషయాలు

బీహార్ రాష్ట్రంలో దర్బాంగ రైల్వే స్టేషన్ కు సికింద్రాబాద్ నుండి వచ్చిన పార్శిల్ పేలుడు చోటు చేసుకొందని  ఎన్ఐఏ గుర్తించింది. ఈ పార్శిల్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు హైద్రాబాద్ లో ఉంటున్న ఇమ్రాన్,నసీర్ లను అరెస్ట్ చేశారు.వీరిద్దరితో పాటు మూడో వ్యక్తికి కూడ పేలుడు ఘటనతో సంబంధం ఉందనే అనుమానాన్ని ఎన్ఐఏ వ్యక్తం చేస్తోంది. మూడో వ్యక్తి హైద్రాబాద్ లో ఉంటున్నారని ఎన్ఐఏ గుర్తించింది. మూడో వ్యక్తి ఆచూకీ కోసం ఎన్ఐఏ హైద్రాబాద్ లో జల్లెడ పడుతోంది.

రెండు రైల్వేబోగీలను పేల్చాలని నిందితులు ప్లాన్ చేశారని ఎన్ఐఏ గుర్తించింది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే పాట్నా ఎయిర్ పోర్టుకు పేలుడు పదార్దాలను తరలించాలని  ప్లాన్ చేశారు.ఈ విషయాన్ని విచారణలో ఎన్ఐఏ గుర్తించింది.బీహార్ లోని దర్బాంగ  ర్వైల్వేస్టేషన్ లో గత నెల 17వ తేదీన పేలుడు వాటిల్లింది. ఎన్ఐఏ అరెస్ట్ చేసిన ఇద్దరు కూడ లష్కరేతోయిబా ఉగ్రవాదులుగా గుర్తించారు. 
 

click me!