దళితులకు సామాజిక ఆర్ధిక బాధలు పోవాలి:అఖిలపక్షంలో కేసీఆర్

By narsimha lode  |  First Published Jun 27, 2021, 2:19 PM IST

 దళితులకు సామాజిక, ఆర్ధిక బాధలు పోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు.



హైదరాబాద్: దళితులకు సామాజిక, ఆర్ధిక బాధలు పోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు.ఆదివారం నాడు  ప్రగతి భవన్ లో సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ స్కీమ్ పై  అఖిలపక్షంతో  కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో  సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశంలో ఈ స్కీమ్ ఉద్దేశ్యాలను వివరించారు. దళిత సమాజం ముందుకు వెళ్లడానికి ప్రభుత్వానికి సూచనలు చేయాలని సీఎం కోరారు. ఆత్మసైర్థ్యంతో దళిత సమాజం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. 

also read:దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్: ప్రగతి భవన్ లో ప్రారంభమైన ఆల్ పార్టీ మీటింగ్

Latest Videos

దేశంలో సామాజికంగా పీడిత వర్గాలు ఎవరంటే చెప్పే పేరు దళితులు అని చెప్పే పరిస్థితి దారుణమన్నారు. ఈ బాధలు పోవాలని తెలంగాణ ప్రభుత్వం కోరుకొంటుందని ఆయన చెప్పారు.పార్టీలకు అతీతంగా సమిష్టి కార్యాచరణతో బాధ్యత తీసుకొని దళితుల అభ్యున్నతికి పాటుపడుతామన్నారు. ఈ సమావేశానికి దళిత సామాజిక వర్గానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు కూడ ప్రభుత్వం ఆహ్వానం పంపింది.ఈ సమావేశాన్ని బీజేపీ బహిష్కరించింది. 
 

click me!