దైవదర్శనానికి వెళుతుండగా ప్రమాదం... నదిలో మునిగి ఐదుగురు మృతి

By Arun Kumar PFirst Published Jun 27, 2021, 2:05 PM IST
Highlights

మంజీరా నదిలో మునిగి ఐదుగురు మృతిచెందిన విషాద సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.  

బీర్కూర్‌: కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ లో విషాద ఘటన చోటుచేసుకుంది. మంజీర పరీవాహక ప్రాంతంలోని చౌడమ్మ ఆలయానికి వెళ్లేందుకు ఓ కుటుంబం నది దాటుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నీటిలో మునిగి ఐదుగురు మృతిచెందారు. మృతులంతా బిచ్కుంద మండలం సెట్‌లూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

కొద్ది రోజుల కిందట మంజీరా నదిలో ఇసుక తవ్వకాలు జరపడంతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కాలినడకన నది దాటుతుండగా ఇలాంటి పెద్ద గుంతలో పడి మునిగిపోయారు. కాపాడేవారు లేక నీటమనిగి ఐదుగురు మరణించారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ఒకే కుటుంబానికి చెందినవారు మరణించడంతో రోదనలు మిన్నంటాయి. 

తల్లి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి మొత్తం నలుగురు చనిపోయారు.

మృతుల వివరాలు: 

1. అంజవ్వ (40)

2. సోనీ (17)

3. చింటూ (07)

4. గంగోత్రి (12)
 

click me!