
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్( Telananga CM KCR) సోమవారం నాడు ఢిల్లీ (Delhi)నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (Telangana Chief secretary Somesh kumar) తో ఫోన్ లో మాట్లాడారు.గులాబ్ తుఫాన్ (cyclone Gulab) ప్రభావం కారణంగా రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిస్థితిపై సీఎం కేసీఆర్ సీఎస్ సోమేష్ కుమార్ తో చర్చించారు.మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు. దీంతో రానున్న రెండు రోజుల పాటు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారలకు సూచించారు.
ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చూడాలని సీఎస్ సోమేష్ కుమార్ ను కోరారు. అవసరమైతే హైద్రాబాద్, కొత్తగూడెం, వరంగల్ జిల్లాలకు ఎన్డీఆర్ఎప్, బృందాలు, పంపాలని సీఎస్ సోమేష్ కుమార్ ను ఆదేశించారు సీఎం కేసీఆర్. ప్రతి జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.జిల్లా కలెక్టర్లు, ఎస్పీు, సమన్వయంతో పనిచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
ఈ నెల 24వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. గులాబ్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందనే విషయమై కేసీఆర్ సీఎస్ సోమేష్ కుమార్ తో చర్చించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.