ఆడపిల్ల పుట్టిందని.. భార్య గొంతు నులిమి చంపేసిన భర్త..!

Published : Sep 28, 2021, 07:56 AM ISTUpdated : Sep 28, 2021, 08:04 AM IST
ఆడపిల్ల పుట్టిందని.. భార్య గొంతు నులిమి చంపేసిన భర్త..!

సారాంశం

మరోసారి పల్లవి గర్భం దాల్చగా.. ఈ నెల 22న ఆమె మళ్లీ ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. మరోసారి కూడా భార్య ఆడపిల్లలకు జన్మనిచ్చిందంటూ భార్యపై కోపం పెంచుకున్నాడు. 

చివరి దాకా.. తోడు ఉంటానని నమ్మించి పెళ్లి బంధంతో జీవితంలోకి అడుగుపెట్టారు. అలాంటివారు చిన్న కారణాలకే భార్యలను అతి కిరాతకంగా హత్య  చేశారు. ఒకరు ఆడపిల్ల పుట్టిందని భార్యను చంపేయగా.. మరొకరు.. భార్యకు అబార్షన్ అయిన తర్వాత చంపేశారు. ఒక సంఘటన గద్వాల జిల్లాలో చోటుచేసుకోగా.. మరో ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఈ రెండు సంఘటనల పూర్తి వివరాల్లోకి వెళితే..

 వనపర్తి జిల్లా మదనాపురం గ్రామానికి చెందిన శకుంతలమ్మ, ఆంజనేయుల కుమార్తె పల్లవి(25)కి 2019 నవంబర్ లో గద్వాల్ కు చెందిన వెంకటేష్ తో జరిగింది. వెంకటేష్ ఎంపీడీవో కార్యక్రమంలో అటెండర్ గా పనిచేస్తున్నాడు. కాగా.. పెళ్లైన కొద్ది నెలలకే వెంకటేష్ అదనపు వరకట్నం తేవాలంటూ పల్లవిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో.. ఆమె తల్లిదండ్రులు 2020 మార్చిలో ఓ ఫ్లాట్ ను వెంకటేష్ కు రాసిచ్చారు. ఆ తర్వాత పల్లవి 2020 అక్టోబర్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

మరోసారి పల్లవి గర్భం దాల్చగా.. ఈ నెల 22న ఆమె మళ్లీ ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. మరోసారి కూడా భార్య ఆడపిల్లలకు జన్మనిచ్చిందంటూ భార్యపై కోపం పెంచుకున్నాడు. మళ్లీ అదనపు కట్నం కావాలని వేధించాడు. కట్నం తేవడానికి పల్లవి నిరాకరించింది. దీంతో.. ఈ విషయంలో దంపతుల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఈ క్రమంలో.. కోపంతో భార్య గొంతు నులిమి హత్య చేశాడు. అనారోగ్యంతో చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నంచేశాడు. అయితే.. దర్యాప్తులో అది అబద్ధమని.. అతనే హత్య చేశాడని తెలియడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక హైదరాబాద్ లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట జేపీ నగర్ లోనూ ఓ మహిళను భర్త హత్య చేశాడు.  నిజామాబాద్ జిల్లా దర్పల్లికి చెందిన మానస(24) తో జగద్గిరిగుట్టకు చెందిన గంగాధర్(32) కు గతేడాది నవంబర్ 20న వివాహం జరిగింది. కొద్ది నెలలకే వీరి ఇద్దరి మధ్య కలహాలు చోటుచేసుకోవడంతో మూడు నెలల కిందట మానస పుట్టింటికి వెళ్లిపోయింది.

గంగాధర్ మూసాపేటలోని  జేపీ నగర్ లో ఉంటున్నాడు. 10 రోజుల క్రితం గంగాధర్ తండ్రి మరణించడంతో మానస జగద్గిరిగుట్టలోని అత్తారింటికి వచ్చింది. ఆదివారం తన భార్య మానసను గంగాధర్ మూసాపేటలో తానుంటున్న ఇంటికి తీసుకువచ్చాడు. సాయంత్రం ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. తాను  అబార్షన్ చేయించుకున్నాని భర్తకు చెప్పడంతో.. అతను కోపంతో ఊగిపోయాడు. వెంటనే గొంతు నులిమి  చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?