హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌హౌస్‌లపై దాడులు.. నాలుగు చోట్ల అసాంఘిక కార్యకలాపాల గుర్తింపు.. 26 మంది అరెస్ట్..

Published : Feb 13, 2023, 05:26 PM IST
హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌హౌస్‌లపై దాడులు..  నాలుగు చోట్ల అసాంఘిక కార్యకలాపాల గుర్తింపు.. 26 మంది అరెస్ట్..

సారాంశం

హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌హౌస్‌లపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. 32 ఫామ్‌హౌస్‌లలో తనిఖీలు నిర్వహించారు. 

హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌హౌస్‌లపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు.32 ఫామ్‌హౌస్‌లలో తనిఖీలు నిర్వహించారు. వీకెండ్ సమయంలో ఈ సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో 4 ఫామ్ హౌస్‌ల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ సోదాలు సందర్భంగా మొత్తం 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడుల్లో భారీగా మద్యం, హుక్కా సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రూ. 1.03 లక్షల నగదు, 7 ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

అసాంఘిక కార్యకలాపాలు జరుగుతన్నట్టుగా గుర్తించివాటిలో మెయినాబాద్‌లోని బిగ్ బాస్ ఫామ్ హౌస్, జహంగీర్ డ్రీమ్ వ్యాలీ, శంషాబాద్ పరిధిలోని రిప్లెజ్ ఫామ్‌హౌస్, మేడ్చల్‌లోని గోవర్దన్ రెడ్డి ఫామ్ హౌస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల నమోదు ఎలా చేసుకోవాలి? అర్హతలు ఏంటి?
Weather Update: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాలు