హైద్రాబాద్‌లో క్రెడిట్ కార్డులతో రూ. 50 కోట్ల మోసం: ఏడుగురు సభ్యుల ముఠా అరెస్ట్

By narsimha lodeFirst Published Jan 13, 2022, 4:12 PM IST
Highlights

క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాను  అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. గురువారం నాడు ఆయన తన కార్యాలయంలో మీడియాకు ఈ ముఠా వివరాలను వెల్లడించారు.
 

హైదరాబాద్: Credit కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు.
గురువారం నాడు హైద్రాబాద్ లోని తన కార్యాలయంలో Stephen Raveendra మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను ముఠా క్లోనింగ్ చేస్తోందని ఆయన చెప్పారు. 

మొహాలీ, పంజాబ్‌కి చెందిన ఏడుగురు ముఠాను అరెస్ట్ చేశామన్నారు.  Navin బొటాని ఈ ముఠాకు  కీలక సూత్రధారిగా ఉన్నాడని సీపీ తెలిపారు.. విదేశాల్లో ఉన్న వారికి క్రెడిట్ కార్డులను ముఠా సప్లై చేస్తోందన్నారు. ఆన్‌లైన్ ద్వారా క్రెడిట్ కార్డులను ముఠా అమ్ముతోందన్నారు.ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులను టార్గెట్‌గా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారని సీపీ వివరించారు. ఇప్పటి వరకూ 50 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

 విదేశీ క్రెడిట్ కార్డులకు ప్రాచైజీగా ఉన్న భారతీయ Bankకు  కూడా ఈ ముఠా టోకరా వేసిందని సీపీ వివరించారు. నిందితులు  80 మందితో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారని సీపీ చెప్పారు. Dubai లో మరో 2 ముఠాలున్నట్టుగా గుర్తించామన్నారు.ఈ ముఠా నుండి  రూ. 1.11 కోట్లు స్వాధీనం చేసుకొన్నామని సీపీ వివరించారు.

గత ఏడాది డిసెంబర్ 2న కూడా నకిలీ కాల్ సెంటర్లను నిర్వహిస్తున్న 28 మందిని కూడా సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఎస్బీఐ కాల్ సెంటర్ ద్వారా కష్టమర్లకు ఫోన్ చేసి ఖాతారులను మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. బ్యాంకు ఖాతాదారుల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా ఫోన్ చేసి ఖాతాదారులను తప్పుదోవ పట్టించేవారని పోలీసులు చెప్పారు. ఖాతాదారులకు వచ్చిన ఓటిపీని తీసుకొని వారి ఖాతా నుండి డబ్బులను స్వాఁహా చేసేవారని పోలీసులు వివరించారు.గత ఏడాది ఈ కాల్ సెంటర్ ద్వారా 33 వేల ఫోన్ కాల్స్ చేశారని పోలీసులు గుర్తించారు. అంతేకాదు నిందితులపై 3 వేల కేసులు నమోదయ్యాయన్నారు.

కరోనా సమయంలో సైబర్ క్రైమ్ కేసులు నమోదౌతున్నాయి. దీంతో పలు ఆశలను చూపుతూ అమాయకులను  మోసానికి గురి చేస్తున్నారు. సైబర్ నేరాల గురించి పోలీసులు ప్రజలను ఎంత చైతన్యవంతం చేసినా కూడా ప్రజలు మోసపోతూనే ఉన్నారు.  గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ లో రుణాల ఇచ్చి వేధింపులకు పాల్పడిన ఘటనలను కూడా చోటు చేసుకొన్నాయి. 

click me!