సీఎం కేసీఆర్ కు బండి సంజ‌య్ లేఖ‌.. ఆ లోపు డిమాండ్ నెర‌వేర్చ‌క‌పోతే.. ఇక అంతే..!

Published : Jan 13, 2022, 03:32 PM IST
సీఎం కేసీఆర్ కు బండి సంజ‌య్ లేఖ‌.. ఆ లోపు డిమాండ్ నెర‌వేర్చ‌క‌పోతే.. ఇక అంతే..!

సారాంశం

సీఎం కేసీఆర్ కు గట్టి కౌంటర్ గా బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మరో లేఖ రాశాడు. ప్ర‌జలను తప్పుదోవ పట్టించేందుకే కేసీఆర్ లేఖ రాశార‌ని, మోడీకి రాశారని బండి సంజయ్ ఆరోపించారు. రైతాంగ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ రాసిన బహిరంగ లేఖ యావత్తు పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉన్నదని  బండి సంజయ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.   

తెలంగాణలో బీజేపీ, అధికార టీఆర్ఎస్ ల మ‌ధ్య రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోన్నాయి. ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతోన్నాయి. హుజురాబాద్ ఉప పోరు నుంచి తెలంగాణ పొలిటిక‌ల్ సీన్ మారింది. హుజురాబాద్ లో బీజేపీ గెలువ‌గానే.. ‘మద్ధతు’ ధర విషయంలో కేంద్రం చేస్తున్న వైఖరికి నిరసనగా ఏకంగా  సీఎం కేసీఆర్ కే ధ‌ర్నా చేశాడు. పార్లమెంట్ లోనూ కూడా టీఆర్ఎస్ ఎంపీలు గంద‌ర‌గోళం చేశారు.  ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం జీవో 317 పై  బీజేపీ ప‌ట్టు బిగించింది. 


ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తోంది. ఈ క్ర‌మంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ అరెస్ట్ చేయ‌డంతో .. ఈ స‌మ‌స్య మరింత జ‌ఠిల‌మైంది. ఏకంగా కేంద్రం నుంచి జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా రంగంలో దిగ‌డంతో రాజ‌కీయం మ‌రింత ర‌స‌వ‌త్తరంగా మారింది. ఈ విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేలా సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ వేశారు. రైతాంగ ప్రయోజనాలు అంటూ ప్రధాని మోడీకి లేఖ రాసి దాన్ని పక్కదారి పట్టించే యత్నం చేశారు. అయితే కేసీఆర్ ఎత్తులు పై ఎత్తుల‌ను ప‌సిక‌ట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అలెర్ట్ అయ్యారు. 

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ అబద్ధాల లేఖకు గట్టి కౌంటర్ గా మరో లేఖ రాశాడు. ప్ర‌జలను తప్పుదోవ పట్టించేందుకే ఈ లేఖను కేసీఆర్ ఏకంగా మోడీకి రాశారని బండి సంజయ్ ఆరోపించారు. రైతాంగ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ రాసిన బహిరంగ లేఖ యావత్తు పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉన్నదని  బండి సంజయ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ప్ర‌భుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులను ఇబ్బందుల పాలు చేస్తు్న్న 317 జీవోను సవరించాలంటూ డిమాండ్ చేశారు. ఈ స‌మ‌స్య ప‌రిష్కారించే వ‌ర‌కు ఉద్యోగుల ప‌క్ష‌న  బీజేపీ ఉద్యమాలు చేస్తోంద‌ని అన్నారు. అలాగే.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని,  నిరుద్యోగుల పక్షాన మహోద్యమానికి శ్రీకారం చుడుతూ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్న ఈ తరుణంలో వాటిని దారి మళ్లించేందుకే ప్రధానమంత్రి గారికి బహిరంగ లేఖ పేరిట మీరు కొత్త డ్రామాకు తెరదీసినట్లు కన్పిస్తోందని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. ఇక, సీఎం ముందు కొన్ని డిమాండ్లను పెట్టిన బండి సంజయ్‌.. వాటిని ఉగాది వరకు అమలు చేయాలి.. లేకుంటే రాష్ట్ర‌వ్యాప్తంగా మ‌హోద్య‌మాన్ని చేస్తామని డెడ్‌లైన్‌ పెట్టారు..

సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాల వ‌ల్ల ఆనందంగా  చేసుకోవాల్సిన సంక్రాంతి పండుగను రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు నేడు కన్నీళ్లతో ‘సకినాల పిండి’ని తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయినా మీరు చేసిన తప్పిదాలను సరిదిద్దుకోకుండా ఎదురు దాడి చేస్తూ రాజకీయ డ్రామాలు చేస్తున్నందున వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీరు లేవనెత్తిన అంశాలపై స్పందిస్తూ బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.

బీజేపీ స‌ర్కార్ రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామ‌నే మాటకు కేంద్రం కట్టుబడి ఉందని… ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలులో భాగంగా  కనీస మద్దతు ధరను పెంచడంతోపాటు రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు.

ఈ క్ర‌మంలో బండి సంజయ్ కొన్ని డిమాండ్లను సీఎం కేసీఆర్ ముందుకు తీసుకోవ‌చ్చారు. అవి ఇలా ఉన్నాయి..

- 2017 ఏప్రిల్ 13న టీఆర్ ఎస్  ఇచ్చిన హామీ ప్ర‌కారం.. రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా ఎరువులను అందించాలి.  

- అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో ప్ర‌కారం.. లక్ష రూపాయల లోపు ఉన్న పంట రుణమాఫీని వెంట‌నే 
 అమలు చేయాలి.

- రాష్ట్రంలో పండించే  వడ్లు, పత్తి, మొక్కజొన్నసహా ఇత‌ర ఉత్పత్తులకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున ‘బోనస్’ ప్రకటించాలి.

- కేంద్రం కేటాయించిన నిధులతో రైతుల పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించాలి. అలాగే.. పంటల ప్రణాళికను ప్రకటించాలి.

- వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీలను తక్షణమే అమలు చేయాలి. అర్హులైన రైతులకు మాత్రమే వాటిని అందించాలి.

- ఎన్నిక‌ల హామీ ప్ర‌కారం.. పాలీహౌజ్ సబ్సిడీని పునరుద్దరించాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు అదనపు పాలీహౌజ్‌ల నిర్మాణానికి ప్రోత్సాహకం అందించాలి.

- ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలి.

- విత్తన సబ్సిడీని అమలు చేయాలి. నకిలీ విత్తనాలను పూర్తిగా అరికట్టాలి.

- అకాల వర్షాలకు నష్టపోతున్న రైతాంగానికి ఆదుకోవాల‌ని.. వారి కోసం ‘క్రాప్ ఇన్సూరెన్సు’ పథకాన్ని అమలు చేయాలి.

- రైతులకు మేలు క‌లిగించేలా మార్కెట్‌లో ‘ఈ-నామ్’ పద్దతిని ప్రవేశపెట్టాలి. 

- బిందు సేద్యంలో భాగంగా ఎస్సీలకు 90 శాతం, బీసీలకు 50 శాతం సబ్సిడీ ఇవ్వాలి. అని డిమాండ్‌ చేశారు బండి సంజయ్.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR: కేసీఆర్ రీ ఎంట్రీతో తెలంగాణ రాజకీయం హీట్.. హాట్ కామెంట్స్ తో రచ్చ
KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu