అరెస్ట్ చేయిస్తానని ఒకడు. జైలుకు పంపిస్తామని ఒకడు పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారు... ఎర్రబెల్లి దయాకర్

Published : Jan 13, 2022, 02:00 PM IST
అరెస్ట్ చేయిస్తానని ఒకడు. జైలుకు పంపిస్తామని ఒకడు పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారు... ఎర్రబెల్లి దయాకర్

సారాంశం

రైతులను పక్కదోవ పట్టించవద్దని.. దొంగ చట్టాల పేరుతో రైతులను బీజేపీ మోసం చేస్తోందన్నారు. మీ రాష్ట్రాల్లో ఏం చేశారో.. మేము ఏం చేశామో చర్చకు కేటీఆర్ సిద్ధమని ఎర్రబెల్లి పేర్కొన్నారు. రైతులకు మద్దతుగా దేశ వ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు. కేంద్రం రైతు అనుకూల నిర్ణయాలు తీసుకునే వరకూ టీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని ఎర్రబెల్లి తెలిపారు. 

హైదరాబాద్ : ‘bandi sanjayకు దమ్ముంటే kcr, ktrల మీద చేయి వెయ్యమనండి. ప్రజలే ఉరికించి కొడతారు. అరెస్ట్ చేయిస్తానని ఒకడు. జైలుకు పంపిస్తామని ఒకడు పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారు’ అని మంత్రి Errabelli Dayakar rao పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం రైతుల మీద కక్ష సాధింపుతో ఉందన్నారు. ఎరువుల విషయంలో బీజేపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. 

కేంద్రం దిగివచ్చి రైతులకు గిట్టుబాటు ధర నిర్ణయించాలన్నారు. TPCC చీఫ్ revanth reddy ఏవేవో ప్రగల్భాలు పలికాడన్నారు. కాంగ్రెస్ రైతులకు వ్యతిరేకంగా చేసినప్పుడు రేవంత్ విమర్శలు చేశాడని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఎస్సారెస్పీ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఎడారి కావటానికి కారణం కాంగ్రెస్, బీజేపీలేనన్నారు. రైతులను పక్కదోవ పట్టించవద్దని.. దొంగ చట్టాల పేరుతో రైతులను బీజేపీ మోసం చేస్తోందన్నారు. మీ రాష్ట్రాల్లో ఏం చేశారో.. మేము ఏం చేశామో చర్చకు కేటీఆర్ సిద్ధమని ఎర్రబెల్లి పేర్కొన్నారు. రైతులకు మద్దతుగా దేశ వ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు. కేంద్రం రైతు అనుకూల నిర్ణయాలు తీసుకునే వరకూ టీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని ఎర్రబెల్లి తెలిపారు. 

కాగా, బుధవారం సీఎం KCR అవినీతిపై కేంద్రం సీరియస్ గా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు bandi sanjay పేర్కొన్నారు. ఆల్రెడీ కేసీఆర్ పై కేంద్ర ప్రభుత్వం చర్యలకు సిద్ధమైందన్నారు. ఎప్పుడైనా కేసీఆర్ jailకి వెళ్లొచ్చన్నారు. ఈ విషయం కేసీఆర్ కు తెలిసిపోయిందని.. అందుకే కమ్యూనిస్టులతోనూ, విపక్ష నేతలతోనూ భేటీ అవుతున్నాడన్నారు. 

కేంద్ర ప్రభుత్వం జైలుకు పంపిస్తుందేమోనని.. ముందుగానే కేసీఆర్ సానుభూతి కోసం యత్నిస్తున్నాడని బండి సంజయ్ పేర్కొన్నారు. ‘ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు.. దోచు కోవడం.. దాచుకోవడమే... కేసీఆర్ ను ఎక్కడున్నా గుంజుకొచ్చుడే.. కేసీఆర్ డ్రామాలు చేస్తున్నాడు. జైలుకు పోవడం పక్కా’ అని బండి సంజయ్ పేర్కొన్నాడు. అంతేకాదు ఆయన ఎన్ని డ్రామాలు చేసినా కేంద్రం వదిలిపెట్టదన్నాడు. ఫాం హౌస్ లో పండేటోడు దేశ రాజకీయాల్లోకి వెళ్లి ఏం చేస్తాడు? అని ప్రశ్నించారు.

కాగా, బండిసంజయ్ మీద టీఆర్ నేత, ఎమ్మెల్యే jeevan reddy విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ముట్టుకుంటే telanganaతో పాటు దేశం అగ్ని గుండం అవుతుందని పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఎ.జీవన్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే తాము Uttar Pradesh Elections ప్రచారంలో పాల్గొంటామని, అవసరమైతే సీఎంకూడా ప్రచారం చేస్తారని వెల్లడించారు.

టీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడుతూ బీజేపీ పార్టీని సర్కస్ కంపెనీగా మార్చి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ షో నిర్వహిస్తున్నాడని అన్నారు. వార్డు మెంబర్ గా కూడా గెలవని ఆ పార్టీ నేత మురళీధర్ రావు కాళేశ్వరంలో అవినీతి అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ఆ రాష్ట్ర మాజీ సీఎం పఢ్నవీస్ మహబూబ్ నగర్ సభకు ముఖం చాటేశారన్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా రాష్ట్రానికి చేసింది శూన్యం అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR: కేసీఆర్ రీ ఎంట్రీతో తెలంగాణ రాజకీయం హీట్.. హాట్ కామెంట్స్ తో రచ్చ
KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu