దిశ నిందితులకు మరో 9 కేసులతో లింకులు: ఆధారాలు సేకరించిన పోలీసులు

By narsimha lode  |  First Published Dec 25, 2019, 12:57 PM IST

దిశ నిందితులకు మరో 9 కేసులతో కూడ లింకులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.ఈ కేసులో ఆధారాలను పోలీసులు సేకరించారు. 



హైదరాబాద్: దిశ కేసులో నిందితులకు మరో 9 కేసులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానంతో ఉన్నారు. ఈ మేరకు  ఈ కేసులకు సంబంధించిన ఆధారాలను కూడ సేకరించారు. ఎన్‌కౌంటర్ జరిగిన రోజునే సజ్జనార్ ఇతర కేసులతో కూడ నిందితులకు సంబంధాలు ఉన్నాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు.

Also read:హైకోర్టుకు చేరిన దిశ నిందితుల రీపోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టు

Latest Videos

గత నెల 27వ తేదీన శంషాబాద్‌కు సమీపంలోని చటాన్‌పల్లి సర్వీస్ రోడ్డుకు సమీపంలోని  భవనంలో  దిశపై నలుగురు నిందితులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్య చేశారు. ఈ కేసు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఈ నెల 6వ తేదీన  చటాన్‌పల్లి అండర్‌పాస్ బ్రిడ్జి వద్ద ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు మృతి చెందారు.

Also read:కారణమిదే: దిశ నిందితుల మృతదేహాలకు నేడు అంత్యక్రియలు

ఈ నలుగురు నిందితుల అంత్యక్రియలు కూడ రెండు రోజుల క్రితమే పూర్తయ్యాయి. దిశ కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో కూడ నిందితులకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా ఈ నెల 18వ తేదీ నుండి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 9 కేసుల్లో ఈ నిందితులకు ప్రమేయం ఉందనే పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

also read:దిశ నిందితుల మృతదేహాలకు ముగిసిన రీపోస్ట్‌మార్టం: బంధువులకు అప్పగింత

ఈకేసులకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఏడాదిగా  అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన కేసులకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరించారు.

Also Read:రీ పోస్టుమార్టం: దిశ నిందితుల డెడ్‌బాడీలకు నో ఎంబామింగ్

కర్ణాటక, రంగారెడ్డి, సంగారెడ్డి, మహాబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి పోలీసులు సేకరిస్తున్నారు. ఆయా సంఘటనలు చోటు చేసుకొన్న సమయంలో నిందితుల సెల్‌ఫోన్ టవర్ లోకేషన్లను  పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ రకంగా  15 కేసులను పోలీసులు పరిశోధించారు. ఈ కేసుల్లో 9 కేసుల్లో నిందితుల పాత్ర ఉందనే అనుమానాలతో పోలీసులు ఉన్నారు.

Also Read:Year Roundup 2019: ఒక దిశ, ఒక హాజీపూర్.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన తెలంగాణ

ఈ ఏడాది  ఆగష్టు 26వ తేదీన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువుకట్ట సమీపంలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ మహిళను చున్నీతో ఉరేసి చంపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దేవర యంజాల్‌లో  మహిళను రాళ్లతొ కొట్టి చంపారు. ఈ రెండు కేసుల్లో మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు పాత్ర ఉందనే పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులకు సంబంధించి పోలీసులు ఆధారాలను సేకరించారు.

అపరిష్కృతంగా ఉన్న  కేసులతో కూడ ఈ నిందితులకు కూడ సంబందాలు ఉన్నాయా అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ వచ్చే జనవరిలో హైద్రాబాద్ కేంద్రంగా చేసుకొని విచారణ చేస్తున్నారు. 


 

click me!