ఓటీటీ కంటెంట్ కాపీ: తోప్ టీవీ నిర్వాహకుడు అరెస్ట్

By narsimha lodeFirst Published Jul 14, 2021, 5:20 PM IST
Highlights

ఓటీటీ కంటెంట్ ను కాపీ కొడుతున్నారనే నెపంతో హైద్రాబాద్ కు చెందిన ఐటీ ఇంజనీర్  సతీష్ వెంకటేశ్వర్లు  అనే వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. తమ కంటెంట్ కాపీ కొడుతున్నారని తోప్ టీవీపై స్టార్ ఇండియా ఫిర్యాదు చేసింది. 

హైదరాబాద్: ఓటీటీ కంటెంట్ ను కాపీ కొడుతున్నారనే నెపంతో  హైద్రాబాద్ కు చెందిన ఓ ఐటీ ఇంజనీర్  సతీష్ వెంకటేశ్వర్లును మహారాష్ట్ర పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.హైద్రాబాద్ కు చెందిన ఐటీ ఇంజనీర్ ఓటీటీ కంటెంట్ ను కాపీ కొడుతున్నట్టుగా గుర్తించి ఫిర్యాదు చేశారు.  తోప్ టీవీ ని  సతీష్ వెంకటేశ్వర్లు  నిర్వహిస్తున్నాడు.   సతీష్ పై స్టార్ ఇండియా ఫిర్యాదు చేసింది. అక్రమంగా తమ కంటెంట్ ను ఉపయోగిస్తున్నారని  ఆ ఫిర్యాదులో పేర్కొంది.

మహారాష్ట్రకు చెందిన సైబర్ సెల్ పోలీస్ టీమ్ కేసు నమోదు చేసింది. మహారాష్ట్ర నుండి ప్రత్యేక పోలీస్ బృందం హైద్రాబాద్ కు చేరుకొని సతీష్ వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసింది.  ఐటీ ఇంజనీర్ ను ముంబై కోర్టులో హాజరు పర్చారు. ఆయనను రిమాండ్ కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అన్ని రకాల ఓటీటీలకు చెందిన కంటెంట్ ను ఒకే ఫ్లాట్ పారంలో తోప్ టీవీ పేరుతో ఆయన అందిస్తున్నాడు. అయితే ఒకే ఫ్లాట్ పారంపై తమ  కంటెంట్ ను కాపీ కొట్టి అందిస్తున్నాడని ఆయా సంస్థలు ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్ట్ చేశారు. 

click me!