
హైదరాబాద్ కొత్త రకం సైబర్ అటాక్ జరిగింది. కంపెనీని చేజిక్కించుకునేందుకు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు.. కొందరితో కలిసి సైబర్ దాడులు చేశారు. వివరాలు.. హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీ హాంగర్ టెక్నాలజీ సంస్థలో డేటా అపహరణకు గురవుతుంది. గత కొనేళ్లుగా ఈ వ్యవహారం సాగుతుంది. దీనిని ఇటీవల గమనించిన హాంగర్ టెక్నాలజీ యాజమాన్యం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇందులో కంపెనీకి ఉద్యోగుల పాత్ర ఉందని పోలీసులు నిర్దారణకు వచ్చారు.
అనంతరం కంపెనీకి చెందిన అందాగ్ విజయ్ కుమార్, కరణ్‌కుమార్, అశ్వంత్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రివాల్వర్, 10 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. అమెరికాలో ఉన్న మరో నిందితుడి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు.