ఎఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రేపు హైద్రాబాద్ కు వస్తారు. భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై చర్చించేందుకు వేణుగోపాల్ హైద్రాబాద్ కు రానున్నారు.
హైదరాబాద్: ఎఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం నాడు హైద్రాబాద్ కు రానున్నారు. భారత్ జోడో యాత్రపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలతో కేసీ వేణుగోపాల్ చర్చించనున్నారు.ఈ నెల 23వ తేదీన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది.దీంతో ఈ యాత్ర ఏర్పాట్లపైచర్చించేందుకు వేణుగోపాల్ హైద్రాబాద్ కు వస్తున్నారు.
భారత్ జోడోయాత్ర ఏర్పాట్లపై తెలంగాణ కాంగ్రెస్ నేతలతో గాంధీ భవన్ లో ఈ నెల 12 వ తేదీ సాయంత్రం సమావేశం నిర్వహించనున్నారు. భారత్ జోడో యాత్రకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లు ఇంకా చేయాల్సిన ఏర్పాట్ల గురించి కేసీ వేణుగోపాల్ చర్చించనున్నారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర కర్ణాటకలో సాగుతుంది. కర్ణాటకలోని రాయిచూరు నుండి తెలంగాణలోని మక్తల్ నియోజకవర్గంలోకి రాహుల్ పాదయాత్ర ఈ నెల 23న ప్రవేశించనుంది.
also read:భారత్ జోడో యాత్ర: తెలంగాణలో రెండు రోజులు రాహుల్ పాదయాత్రకు బ్రేక్
తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలపై కేంద్రీకరించారు. అదే సమయంలో రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో ప్రవేశించనుంది.ఉప ఎన్నికలతో పాటు రాహుల్ పాదయాత్రపై కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రీకరించనుంది.
మక్తల్ అసెంబ్లీ నియోజకర్గం నుండి హైద్రాబాద్,సంగారెడ్డి మీదుగా మహారాష్ట్రలోకి రాహుల్ పాదయాత్ర సాగనుంది. రాహుల్ పాదయాత్రను విజయవంతం చేయాలనికాంగ్రెస్ పార్టీ నాయకత్వం పట్టుదలగా ఉంది. పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయంలో రాహుల్ గాంధీ పూజలుచేస్తేలా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు. గతంలో రాజీవ్ గాంధీ నిర్వహించిన సద్భావన యాత్ర రూట్ లోనే రాహుల్ గాంధీ యాత్ర రూట్ మ్యాప్ ను రూపొందించారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారిలో పాదయాత్రను ప్రారంభించారు. జమ్మూకాశ్మీర్ వరకుపాదయాత్రను నిర్వహించనున్నారు రాహుల్ గాంధీ. దేశంలోని సుమారు 3570కి.మీ పాదయాత్ర చేయాలని రాహుల్ గాంధీ తలపెట్టారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల గుండా పాదయాత్ర కర్ణాటకలోకి ప్రవేశించింది.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికలపై ఠాగూర్ పార్టీ నేతలతో చర్చించారు.
వచ్చే ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ ను పార్టీ నియమించుకుంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో సునీల్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. సునీల్ పార్టీ స్థితి గతులపై రాహుల్ గాంధీకి నివేదిక ఇస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగానే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయాలు తీసుకుంటున్నారు.