CWC meeting: డాన్సుతో అద‌ర‌గొట్టిన సీతక్క..సీడబ్ల్యూసీ మీట్ లో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు

By Mahesh Rajamoni  |  First Published Sep 17, 2023, 9:41 AM IST

Hyderabad: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, పార్టీకి సంబంధించిన ఇతర అంశాలపై పార్టీ తన చర్చలను కొనసాగిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ ) సమావేశం ఆదివారం (సెప్టెంబర్ 17) రెండవ-చివరి రోజుకు వెళ్లింది. పునర్వ్యవస్థీకరించిన సీడబ్ల్యూసీ మొదటి సమావేశంలో మొదటి రోజు దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, కుల ఆధారిత జనాభా గణనతో సహా వివిధ సమస్యలకు సంబంధించిన‌ తీర్మానాన్ని ఆమోదించారు.
 


CWC meeting: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, పార్టీకి సంబంధించిన ఇతర అంశాలపై పార్టీ తన చర్చలను కొనసాగిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ ) సమావేశం ఆదివారం (సెప్టెంబర్ 17) రెండవ-చివరి రోజుకు వెళ్లింది. పునర్వ్యవస్థీకరించిన సీడబ్ల్యూసీ మొదటి సమావేశంలో మొదటి రోజు దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, కుల ఆధారిత జనాభా గణనతో సహా వివిధ సమస్యలకు సంబంధించిన‌ తీర్మానాన్ని ఆమోదించారు.

అయితే, సీడబ్ల్యూసీ స‌మావేశం సంద‌ర్భంగా కాంగ్రెస్ నాయ‌కులు వారి ఉత్సాహాన్ని ప్రదర్శించిన ఆసక్తికరమైన సంఘటనలు కనిపించాయి. ములుగు ఎమ్మెల్యే దాన్సరి సీతక్క తన సంతోషం, ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ డాన్సు చేశారు. తన నృత్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ.. వేదిక వద్ద అతిథులకు స్వాగతం పలికిన సాంస్కృతిక బృందంలో భాగంగా ఉండి.. త‌న డాన్సుతో అద‌ర‌గొట్టారు. ఇక‌ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ నగరంలో తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. జవహర్ న‌గ‌ర్ డంపింగ్ యార్డులోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను పరిశీలించారు.

త్యాగాల కుటుంబానికి తెలంగాణ సమాజం స్వాగతం పలుకుతోంది… pic.twitter.com/sx0RTYpUyt

— Danasari Seethakka (@seethakkaMLA)

Latest Videos

undefined

ఆయన వెంట బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహానగర పాలికె) అధికారులు ఉన్నారు. ట్రీట్ మెంట్ ప్లాంట్ విధానం గురించి శివకుమార్ అధికారులను అడిగి తెలుసుకున్నారనీ, జీహెచ్ ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు వివరించారని తెలిపారు. అలాగే, నగరంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. కాగా, మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే, ఈ స‌మావేశం సంద‌ర్భంగా నాయకులను వారి ఫోన్లను గది వెలుపల ఉంచమన్నారు. సమావేశ మందిరంలోకి ప్రవేశించే ముందు రాహుల్ గాంధీ సహా నేతలు తమ ఫోన్లను నిర్ణీత ప్రదేశంలో ఉంచారు. ఇక సభాస్థలిలో చేసిన భోజన ఏర్పాట్లను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా అభినందించినట్లు సమాచారం.

ఇదే స‌మ‌యంలో ఎంపీ వినోద్ రెడ్డి వంటి కాంగ్రెస్ సీనియర్ నేతల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనీ, వారి వయసును పరిగణనలోకి తీసుకోకుండా, వారిని నెట్టివేసి, తోసేయడం, ఎయిర్ పోర్టులో ప్రముఖులకు స్వాగతం పలకడం వంటి విషయాల్లో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి.

click me!