బిర్యానీతోపాటు ఎక్స్‌ట్రా రైతా అడిగినందుకు కొట్టి చంపారు.. పంజాగుట్ట రెస్టారెంట్‌లో ఘటన

By Mahesh K  |  First Published Sep 11, 2023, 6:30 PM IST

బిర్యానీతోపాటు ఎక్స్‌ట్రా రైతా కావాలని అడిగిన ఓ కస్టమర్‌ను హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్ స్టాఫ్ చితకబాదారు. రైతా కావాలని అడిగిన తర్వాత స్టాఫ్‌కు, కస్టమర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ పంచాయతి రాత్రి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు చేరింది. అప్పుడే కస్టమర్ చాతిలో నొప్పి, ఊపిరాడటం లేదని చెబుతూ కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్లేలోపే మరణించాడు.
 


హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన 32 ఏళ్ల కస్టమర్ బిర్యానీతోపాటు ఎక్స్‌ట్రా రైతా(మజ్జిగ!) కావాలని అడిగాడు. ఈ విషయంలోనే రెస్టారెంట్ స్టాఫ్ సిబ్బందితో గొడవ పడ్డాడు. ఆ గొడవ పెద్దదైంది. చివరికి ఇది పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు చేరింది. అక్కడే ఛాతిలో నొప్పి, శ్వాస అందక బాధితుడు కిందపడిపోయాడు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, ఆ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

32 ఏళ్ల లియాఖత్ తన మిత్రులతో కలిసి మెరిడియన్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఎక్స్ ట్రా రైతా కావాలని స్టాఫ్‌ను అడిగాడు. ఇందులోనే స్టాఫ్‌తో వాదనకు దిగాడు. వాగ్వాదం పెరిగి గొడవగా మారింది. దీంతో లియాఖత్ ఆయన మిత్రులు ఒక వైపు, స్టాఫ్ మరోవైపు తీవ్రంగా కొట్టుకున్నారు. ఇరు వర్గాలు తీవ్రంగా దాడి చేసుకున్నట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.

Latest Videos

undefined

హోటల్ మేనేజర్ సహా స్టాఫ్ లియాఖత్‌పై తీవ్రంగా దాడి చేసినట్టు ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఆ తర్వాత ఈ ఇష్యూను పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు రాత్రి 11 గంటల ప్రాంతంలో తీసుకెళ్లారు. పోలీసులను ఆశ్రయించిన తర్వాత లియాఖత్ మాత్రం ఊపిరాడటం లేదని, చాతిలో నొప్పి అంటూ ఫ్లోర్ పై పడిపోయాడు. ఆయనను వెంటనే హాస్పిటల్ తరలించారు. అప్పటికే లియాఖత్ మరణించినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు. 

Also Read: ఇప్పుడు రాహుల్ గాంధీ పేరు మార్చాలి.. : అసోం సీఎం హిమంత శర్మ డిమాండ్

పోలీసులు ఆ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పంపించారు. ఇది బహుశా కార్డియక్ అరెస్ట్ అయి ఉండొచ్చని వైద్యులు అనుమానించారు. అయితే.. మరణానికి సరైన కారణంగా పోస్టుమార్టం పూర్తయిన తర్వాత వచ్చే నివేదికలో తేలనుంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నది.

click me!