హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 14 కిలోల బంగారం సీజ్: నలుగురు అరెస్ట్

By narsimha lode  |  First Published Feb 23, 2023, 10:08 AM IST

హైద్రాబాద్  శంషాబాద్  ఎయిర్ పోర్టులో  14 కిలోల బంగారాన్ని విదేశీ ప్రయాణీకుల నుండి సీజ్  చేశారు  అధికారులు.



హైదరాబాద్: హైద్రాబాద్  శంషాబాద్  ఎయిర్ పోర్టులో  14  కిలోల బంగారాన్ని  అధికారులు  గురువారంనాడు  సీజ్  చేశారు.సూడాన్ నుండి  వచ్చిన  నలుగురు  ప్రయాణీకుల నుండి బంగారాన్ని  సీజ్ చేశారు  అధికారులు. సూడాన్ నుండి  వచ్చిన  23 మంది ప్రయాణీకుల నుండి  ఈ బంగారాన్ని సీజ్  చేశారు.  వీరిలో  14 మందిని అధికారులు  అరెస్ట్  చేశారు.  

గతంలో  కూడ శంషాబాద్  ఎయిర్ పోర్టులో  ప్రయాణీకుల  నుండి  బంగారం సీజ్  చేసిన ఘటనలు  చోటు  చేసుకున్నాయి. 2022 నవంబర్  12వ తేదీన  5.5 కిలోల  బంగారాన్ని  ఇద్దరు ప్రయాణీలకుల  నుండి కస్టమ్స్  అధికారులు సీజ్  చేశారు. అమిర్ ఖాన్,  మహ్మద్  ఖురేషి  నుండి  అధికారులు బంగారాన్ని సీజ్ చేశారు. బంగారాన్ని  పేస్ట్  రూపంలోకి మార్చి   తరలిస్తుండగా  కస్టమ్స్  అధికారులు  సీజ్  చేశారు. 

Latest Videos

2022  అక్టోబర్  06వ తేదీన   శంషాబాద్  ఎయిర్ పోర్లులో ఏడు కిలోల బంగారాన్ని  అధికారులు సీజ్  చేశారు.  దీని విలువ  సుమారు  రూ.3.5 కోట్లుగా  ఉంటుందని  అధికారులు  చెప్పారు.దుబాయి నుండి  వచ్చిన ప్రయాణీకులు  అక్రమంగా  బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. 

also read:బంగారానికి వెండి కోటింగ్.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.4 కోట్ల గోల్డ్ సీజ్

2022  ఆగష్టు  14వ తేదీన  హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో  రూ. 13.63 లక్షల  విలువైన  బంగారాన్ని సీజ్  చేశారు. ప్రయాణీకులు తమ లోదుస్తుల్లో  ఈ బంగారాన్ని దాచుకుని  తీసుకువచ్చారు.  2022  డిసెంబర్ 12న  800 గ్రాముల బంగారాన్ని  అధికారులు సీజ్  చేశారు. దుబాయి నుండి  వచ్చిన ప్రయాణీకుడి నుండి  కస్టమ్స్ అధికారులు ఈ బంగారాన్ని  స్వాధీనం  చేసుకున్నారు. 

click me!