కాంగ్రెస్ పార్టీతో తనకు ఉన్న బంధాన్ని బాధతో తెంచుకుంటున్నట్టుగా మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: చాలా బాధతో కాంగ్రెస్ పార్టీతో తాను బంధాన్ని తెంచుకొంటున్నట్టుగా మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరణకు గురైన తర్వాత మర్రి శశిధర్ రెడ్డి మంగళవారంనాడు హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా బాధతో కాంగ్రెస్ తో బంధం తెంచుకుంటున్నానన్నారు.కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. సోనియాగాంధీకి కూడా ఈ విషయమై లేఖను రాసినట్టుగా శశిధర్ రెడ్డి వివరించారు.
ఈ పరిస్థితి వస్తుందని తాను ఏనాడూ ఊహించలేదని చెప్పారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. ఇవాళ్టి నుండి కాంగ్రెస్ పార్టీ హోంగార్డుగా తాను ఉండడం లేదని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నాయని ఆయన తెలిపారు.
undefined
తెలంగాణ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారనే అపవాదు ప్రజల్లోకి వెళ్లిందని మర్రి శశిదర్ రెడ్డి చెప్పారు. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాద్యతలు చేపట్టిన తర్వాత అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందన్నారు. అయినా కూడా ఆయనను సుదీర్ఘకాలంపాటు పీసీసీ చీఫ్ గా కొనసాగించారని మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు.
రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీలు పీసీసీ చీఫ్ లకు ఏజంట్లుగా మారారని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో ఏం జరిగిందో తనకు తెలుసునన్నారు. తన తండ్రి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో ఇంచార్జీలుగా ఉన్న నేతలు ఎలా వ్యవహరించారో తనకు అవగాహన ఉందన్నారు.
పార్టీలో డబ్బు ప్రభావం బాగా పెరిగిందని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. పార్టీలో డబ్బులు ఇచ్చిన వారి మాటే చెల్లుబాటు అవుతుందని ఆయన ఆరోపించారు. పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ కూడా ఇందుకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పీసీసీ చీఫ్ పదవి కోసం రూ. 25 కోట్లు తీసుకున్నారని భువనగరి ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై తాను గతంలో సోనియాగాంధీకి లేఖ రాశానని చెప్పారు. ఈ పరిణామాలను తాను పరిశీలిస్తానని సోనియాగాంధీ తనకు లేఖ రాసినట్టుగా చెప్పారు. సోనియాగాంధీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు.
కోదాడలో తన భార్య పద్మావతి ఓటమి పాలైన తర్వాత పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారన్నారు. కానీ కొత్త పీసీసీ చీఫ్ పదవి ఎంపిక కోసం అప్పటి ఇంచార్జీ పార్టీ సెక్రటరీలకు తెలియకుండానే 17 మంది పేర్లను పార్టీ అధిష్టానానికి పంపారని మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగాలని ఇష్టం ఉన్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారని మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం తనకు చెప్పారని శశిధర్ రెడ్డి తెలిపారు.
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారినట్టుగా ఆయన చెప్పారు. పార్టీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి గురించి ఠాగూర్ మాట్లాడనిచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించని విషయాన్ని శశిదర్ రెడ్డి వివరించారు. కోకాపేట భూముల విషయంపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్టుగా శశిధర్ రెడ్డి తెలిపారు.కానీ రేవంత్ రెడ్డి ఈ భూముల విషయంలో సైలెంట్ గా ఉన్నారన్నారు.హుజూరాబాద్ లో మూడు వేల ఓట్లు వస్తే ఎవరికీ కూడా చీమ కుట్టినట్టు లేదన్నారు.హుజూరాబాద్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆయన విమర్శించారు. దుబ్బాకలో ఏం చేసినా కూడా కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాలేదని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.
రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్, చీటర్ అంటూ శశిదర్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు.రేవంత్ రెడ్డిపై తనకు వేరే ఉద్దేశ్యం లేదని ఆయన చెప్పారు.మునుగోడులో భువనగిరి ఎంపీ వెంకట్ రెడ్డికి తెలియకుండానే సభను పెట్టారన్నారు. అద్దంకి దయాకర్ తో వెంకట్ రెడ్డిపై అలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ అవినీతిపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని శశిధర్ రెడ్డి తెలిపారు.