ముంచేసిన షేర్ మార్కెట్లు.. దంపతుల ఆత్మహత్య

Published : Nov 09, 2018, 11:01 AM IST
ముంచేసిన షేర్ మార్కెట్లు.. దంపతుల ఆత్మహత్య

సారాంశం

షేర్ మార్కెట్లు.. ఇద్దరు దంపతుల ప్రాణాలను బలిగొన్నాయి. అభం శుభం తెలియని చిన్నారిని అనాథగా మార్చేశాయి. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో చోటుచేసుకుంది.

షేర్ మార్కెట్లు.. ఇద్దరు దంపతుల ప్రాణాలను బలిగొన్నాయి. అభం శుభం తెలియని చిన్నారిని అనాథగా మార్చేశాయి. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా రేపల్లె ప్రాంతానికి చెందిన బాపయ్య చౌదరి-శిరీష దంపతులు గచ్చిబౌలిలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరికి పద్మప్రియ అనే మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. కాగా.. వీరిద్దరూ ఉద్యోగాలతో బిజీగా ఉండటంతో.. పాప వాళ్ల అమ్మమ్మగారి ఇంట్లో పెరుగుతోంది.

ఇదిలా ఉండగా... తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశతో కొంతకాలం క్రితం బాపయ్య.. తన సంపాదన మొత్తాన్ని షేర్ మార్కెట్లలో పెట్టారు. అయితే.. అనుకోకుండా భారీ నష్టం రావడంతో.. వారికి ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి.

దాదాపు రూ.కోటిన్నర  కోల్పోయారు. కష్టపడి సంపాదించిన సంపాదన అంతా.. కళ్లముందే ఆవిరైపోవడం శిరీష తట్టుకోలేకపోయింది. భర్త ఇంట్లో లేని సమయంలో పండగ రోజున ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి తిరిగి వచ్చిన భర్తకు భార్య శవమై కనపడింది. అది తట్టుకోలేని బాపయ్య.. వెంటనే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

వీరిద్దరి అకాల మరణంతో.. చిన్నారి పద్మప్రియ అనాథగా మారిపోయింది. వీరి మరణ వార్త విని.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ