వాగులో భారీ మొసలి ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన స్థానికులు..  

Published : Aug 01, 2023, 03:32 PM IST
వాగులో భారీ మొసలి ప్రత్యక్షం.. భయంతో పరుగులు తీసిన స్థానికులు..  

సారాంశం

జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ వాగులో మొసలి కలకలం రేపింది. పాషిగామా గ్రామానికి చెందిన ఓ రైతు వాగులో వ్యవసాయ మోటార్ సెట్ చేస్తుండగా మొసలి కనబడటం తో పరుగులు తీశాడు. 

సాధారణంగా మొసళ్లు సముద్రాలు, నదులల్లో సంచరిస్తూ ఉంటాయి. కానీ.. ఇటీవల కురిసిన వర్షాలకు, వరదలకు పంట పొలాల్లోకి.. కాలువ గట్లపై కూడా కనిపిస్తున్నాయి. వీటిని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వాటిని చూసిన వెంటనే పరుగులు పెడుతున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణలో ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటు చేసుకున్నాయి. తాజాగా అలాంటి ఘటన జగిత్యాల జిల్లా చేటుచేసుకుంది. 

జగిత్యాల జిల్లాలో ఓ భారీ మొసలి కనిపించడం కలకలం రేపింది. వెల్గటూర్ వాగులో పెద్ద మొసలి ఒకటి స్థానికులను భయపెట్టింది. పాషిగామా గ్రామానికి చెందిన రాజు అనే రైతుకు వాగులో వ్యవసాయ మోటార్ సెట్ చేస్తుండగా నీటిలో ఏదో వింత ఆకారం కనిపించింది. దాన్ని క్షుణంగా పరిశీలించగా..మొసలి అని అర్థమైంది. దీంతో భయాందోళన గురైన ఆ రైతు అక్కడ నుంచి పరుగులు తీశారు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. ఈ మొసలి దాదాపు  150 కిలోలు..పొడవు తొమ్మది అడుగుల వరకు ఉండవచ్చని రైతులు చెబుతున్నారు. వాగులోకి ఎవరూ వెళ్లకూడదని స్థానికులు హెచ్చిరిస్తున్నారు. ఈ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. 
 

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్