నేను ఎవరికీ వ్యతిరేకం కాదు: కేటీఆర్ వ్యాఖ్యలకు తమిళిసై కౌంటర్

By narsimha lode  |  First Published Aug 1, 2023, 3:24 PM IST

రాష్ట్ర ప్రభుత్వం  బిల్లులను వెనక్కి పంపడంపై  మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కౌంటరిచ్చారు.


హైదరాబాద్: తాను ఎవరికీ వ్యతిరేకం కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్  చెప్పారు.మంగళవారంనాడు ఆమె  మీడియాతో మాట్లాడారు.  రాష్ట్ర ప్రభుత్వం  పంపిన బిల్లులను వెనక్కి పంపడంపై  నిన్న మంత్రి కేటీఆర్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై విమర్శలు చేశారు.ఈ విమర్శలకు  తమిళిసై సౌందర రాజన్  కౌంటరిచ్చారు. 
రాష్ట్ర ప్రభుత్వం పంపిన  బిల్లులను తిప్పి పంపడం తన ఉద్దేశ్యం కాదన్నారు. బిల్లులను ఎందుకు రిజెక్ట్ చేయాల్సిందో కూడ కారణాలు వివరించిన విషయాన్ని ఆమె  గుర్తు  చేశారు. 

ప్రభుత్వం తనను  కావాలని తప్పుబడుతుందన్నారు.తాను  చెప్పిన కారణాలపై  ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలని చెప్పారు.భారీ వర్షాలు, వరదల కారణంగా  తాను ప్రభుత్వాన్ని నివేదిక అడిగినట్టుగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నివేదిక రాగానే  కేంద్రానికి పంపుతానని గవర్నర్ తెలిపారు. 
ప్రభుత్వం మరింత మెరుగ్గా వరదల సమయంలో వ్యవహరించాల్సి ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు. వర్షాలపై తనకు రాజకీయ పక్షాలు వినతిపత్రాలు ఇచ్చాయన్నారు.

Latest Videos

also read:బిల్లులపై కేసిఆర్ ప్రభుత్వ నిర్ణయం: తమిళిసైతో మరోసారి కయ్యం

వర్షాల వల్ల ప్రజల ఇబ్బందులు తనకు బాధను కల్గించాయన్నారు. ప్రజలకు ప్రభుత్వం  మరింత రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు అండగా ఉండాలని ఆమె సూచించారు. మారుమూల ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని ఆమె చెప్పారు.తెలంగాణ ప్రజలతోనే ఉన్నానని ఆమె తెలిపారు.  వెనక్కి పంపిన బిల్లులకు సంబంధించిన వివరాలు కావాలని స్పీకర్ ను  కోరినట్టుగా గవర్నర్ చెప్పారు.  

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య కొంత కాలంగా  గ్యాప్ కొనసాగుతుంది.  రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై  మంత్రులు విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ పై  రాష్ట్ర ప్రభుత్వం  హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.   ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలను  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రారంభించారు. అయితే  దీంతో  రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య  గ్యాప్ తగ్గిందని భావించారు. కానీ ఈ గ్యాప్ కొనసాగుతూనే ఉంది.  గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులను  ఈ నెల  3 నుండి జరిగే  అసెంబ్లీ సమావేశాల్లో  మరోసారి  ఆమోదించి పంపనుంది ప్రభుత్వం.

 

click me!