రోడ్డెక్కిన చల్లా కుటుంబం.. వారసత్వం కోసం శ్రీలక్ష్మీ-విఘ్నేశ్వర్ రెడ్డి మధ్య పోరు, రంగంలోకి వైసీపీ హైకమాండ్

By Siva KodatiFirst Published Mar 31, 2023, 8:35 PM IST
Highlights

నంద్యాల జిల్లా అవుకు మండలానికి చెందిన దివంగత వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంతో వారసత్వ పోరు రచ్చకెక్కింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలను వైసీపీ హైకమాండ్ ఆదేశించింది. 

నంద్యాల జిల్లా అవుకు మండలానికి చెందిన దివంగత వైసీపీ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంతో వారసత్వ పోరు రచ్చకెక్కింది. తనపై చల్లా రామకృష్ణారెడ్డి సోదరులు దాడి చేసినట్లుగా దివంగత చల్లా భగీరధ రెడ్డి సతీమణి జడ్పీటీసీ శ్రీలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో చల్లా శ్రీలక్ష్మీ, సాయిచరణ్ , సాయిచైతన్య, వంశీ, చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డితో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు చల్లా కుటుంబంలో గొడవలపై వైసీపీ అధిష్టానం స్పందించింది. వెంటనే పరిస్థితిని చక్కదిద్దాల్సిందిగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలను ఆదేశించింది. హైకమాండ్ ఆదేశాలతో వీరిద్దరూ చల్లా కుటుంబ సభ్యులతో గంటల పాటు మంతనాలు జరిపారు. 

చల్లా రామకృష్ణారెడ్డి, చల్లా భగీరథ రెడ్డిల మరణాలతో చల్లా శ్రీలక్ష్మీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆమెకు రామకృష్ణారెడ్డి పెద్ద కుమారుడు విఘ్నేశ్వర్ రెడ్డికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు శ్రీలక్ష్మీ. రాజకీయ పదవులతో పాటు ఆస్తికి సంబంధించిన గొడవలు కూడా చల్లా కుటుంబంలో వున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల తన కార్యాలయానికి వచ్చి చల్లా రామకృష్ణారెడ్డి చిత్రపటాన్ని బలవంతంగా తీసుకెళ్లడమే కాకుండా.. తనపై విఘ్నేశ్వర్ రెడ్డి దాడి చేశారని శ్రీలక్ష్మీ ఆరోపిస్తున్నారు. 
 

click me!