మొయినాబాద్ ఫాంహౌస్ లో క్రికెట్ బెట్టింగ్: నలుగురు అరెస్ట్, రూ. 60 లక్షలు సీజ్

By narsimha lode  |  First Published Apr 18, 2023, 9:19 AM IST

మొయినాబాద్  ఫాంహౌస్ లో  క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న  నలుగురిని  ఎస్ఓటీ  పోలీసులు  ఇవాళ అరెస్టు  చేశారు.


హైదరాబాద్: మొయినాబాద్   ఫాంహౌస్ లో  క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న  నలుగురిని  ఎస్ఓటీ పోలీసులు మంగళవారంనాడు  అరెస్ట్  చేశారు.  నిందితుల నుండి  రూ. 60 లక్షల నగదు, పలు కంప్యూటర్లను  పోలీసులు సీజ్  చేశారు. 

మొయినాబాద్ ‌లోని  ఓ ఫాంహౌస్ లో  క్రికెట్ బెట్టింగ్  నిర్వహిస్తున్నారని  కచ్చితమైన  సమాచారం ఆధారంగా  పోలీసులు   ఫాం:హౌస్ పై దాడి  చేశారు. గతంలో  కూడ  తెలంగాణ రాష్ట్రంలో  క్రికెట్ బెట్టింగ్ కు  పాల్పడుతున్న  సభ్యులను  పోలీసులు అరెస్ట్  చేశారు. 

Latest Videos

undefined

ఈ నెల  11న  క్రిరెట్ బెట్టింగ్  కు పాల్పడుతున్న  ముఠాను  సైబరాబాద్ పోలీసులు అరెస్ట్  చేశారు.  ఐపీఎల్, అంతర్జాతీయ  క్రికెట్ మ్యాచ్ ల  బెట్టింగ్  కు పాల్పడుతున్న 10 మంది సభ్యుల  ముఠాను  పోలీసులు అరెస్ట్  చేశారు. హైద్రాబాద్  శివారులో  కాల్ సెంటర్ ను  ఏర్పాటు  చేసి క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారని పోలీసులు ప్రకటించారు. ఈ నెల  9 వతేదీన  షాద్ నగర్ లో  క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఏడుగురిని  పోలీసులు  అరెస్ట్  చేశారు. నిందితుల నుండి  రూ. 1.15 లక్షలను  సీజ్  చేశారు పోలీసులు.

2022 అక్టోబర్ లో  ఎల్ బీ నగర్ లో  క్రికెట్ బెట్టింగ్ కు  పాల్పడుతున్న  నలుగురిని  పోలీసులు అరెస్ట్  చేశారు. క్రికెట్ బెట్టింగ్ లకు  అలవాటు  పడి  హైద్రాబాద్ వనస్థలిపురానికి  చెందిన ఆశోక్ రెడ్డి   12 ఏళ్లలో  వంద కోట్లు పోగొట్టుకున్నాడు.2022  జూన్  మాసంలో  క్రికెట్ బెట్టింగ్ కు అప్పులు చేసిన  వ్యక్తి  చెరువులో దూకి అనిల్ కుమార్  ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన హైద్రాబాద్ లో  చోటు  చేసుకుంది. 

2021  జూన్ మాసంలో  క్రికెబట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను  హైద్రాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్  చేశారు. నిందితులనుండి రూ. 21 లక్షలు సీజ్  చేశారు  పోలీసులు. 

click me!