మత క్యాన్సర్ ను కట్టడి చేయాలి: మల్లన్నసాగర్ ప్రారంభోత్సవ సభలో కేసీఆర్

Published : Feb 23, 2022, 03:07 PM IST
మత క్యాన్సర్ ను కట్టడి చేయాలి: మల్లన్నసాగర్ ప్రారంభోత్సవ సభలో కేసీఆర్

సారాంశం

దేశం దారి తప్పుతోందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.  దేశాన్ని దారిలోకి తీసుకొచ్చేందుకు తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని కేసీఆర్ తెలిపారు మల్లన్నసాగర్ ప్రారంభోత్సవంలో కేసీఆర్ ప్రసంగించారు. 


సిద్దిపేట: కేంద్రం సహకరించకపోయినా ఏడేళ్లలో Telangana రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం KCR చెప్పారు.  ఇటీవల తాను మహారాష్ట్ర సీఎం Uddhav Thackerayతో సమావేశమైన సమయంలో ఠాక్రే చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. త్వరలోనే తాను తెలంగాణలో పర్యటించి రెండు మూడు పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేస్తామని ఠాక్రే తెలిపిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.  Mallanna Sagar రిజర్వాయర్ ను బుధవారం నాడు సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.Hyderabad లో మత కల్లోలాలు జరుగుతాయని ప్రచారం చేశారని చెప్పారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా కూడా మత కల్లోలాలు చోటు చేసుకోలేదన్నారు. ఎక్కడికక్కడే మత క్యాన్సర్ ను వ్యాపింపచేయకుండా కట్టడి చేయాలని ఆయన ప్రజా ప్రతినిధులను కోరారు. మత కల్లోలాలు జరిగితే ఎవరైనా పెట్టుబడులు పెడతారా అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే పెట్టుబడులు పెడతారని కేసీఆర్ చెప్పారు. 

దేశంలో జుగుప్స కల్గించే పరిస్థితి నెలకొందని  ఆయన చెప్పారు. దేశం దారి తప్పుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలో దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.  కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాలతో విద్యా సంస్థలు మూసిన పరిస్థితి నెలకొందన్నారు. కర్ణాటకలో మత కల్లోలాలు సృష్టించారని కేసీఆర్ విమర్శించారు. దీంతో చదువుకొనేందుకు వెళ్లేందుకు అమ్మాయిలు భయపడుతున్నారని కేసీఆర్ తెలిపారు. తన చివరి రక్తం బొట్టు వరకు దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తానని కేసీఆర్ తెలిపారు.  కేంద్రం సహకరించకపోయినా కూడా పలు పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. 

 రైతు బంధు, రైతు భీమాతో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కేసీఆర్ కిట్స్, కళ్యాణ లక్ష్మి సహా పలు పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. . బెంగుళూరు నుండి 3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు సాగుతున్నాయన్నారు. తెలంగాణ నుండి లక్ష కోట్లు ఎగుమతులున్నాయన్నారు. మూడో స్థానంలో మహారాష్ట్ర నిలిచిందని కేసీఆర్ గుర్తు చేశారు. 

Kaleshwaram ప్రాజెక్టులో 58 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు.14 రాష్ట్రాల నుండి ఈ కార్మికులు వచ్చి పనిచేస్తున్నారన్నారు.తాను కలలుగన్న  సస్యశ్యామల తెలంగాణ సాకారం అవుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు పనులను ఇంజనీర్లు, రాత్రి, పగలు అనే తేడా లేకుండా కష్టపడి పనిచేశారని కేసీఆర్ తెలిపారు. 

ఈ ప్రాజెక్టు పనులను ఆపేందుకు కొందరు దుర్మార్గులు కేసులు వేశారన్నారు. అంతేకాదు మల్లన్నసాగర్  రిజర్వాయర్ పనులను కూడా నిలిపివేసేందుకు ఓ దుర్మార్గుడు  కేసు వేశాడన్నారు.ఈ విషయమై తాను ఆ సమయంలో న్యూఢిల్లీలో ఉన్నానని కేసీఆర్ చెప్పారు. ఢిల్లీ నుండే అప్పటి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో ఫోన్ లో మాట్లాడినట్టుగా చెప్పారు. ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత తాను ఈ రిజర్వాయర్ వివరాలను చీఫ్ జస్టిస్ కు పంపిన విషయాన్న ఆయన గుర్తు చేశారు. కేసులు వేసినా భయపడేది లేదని ఇంజనీర్లు కూడా తనతో చెప్పారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

మల్లన్నసాగర్ కాదు... ఇది తెలంగాణ జల హృదయ సాగర్ అంటూ కేసీఆర్ పేర్కొన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితుల త్యాగం అసమానమన్నారు.  ఇంకా కూడా  పరిహారం అందని బాధితులకు పరిహారం చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 

ప్రాజెక్టుల గురించి కనీస అవగాహన లేని వాళ్లు, పార్టీలు చిల్లర ప్రయత్నాలు చేస్తారని కేసీఆర్ విమర్శించారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించిన సమయంలో చిన్న చిన్న తప్పులు జరుగుతాయన్నారు. అంచనాలు కూడా తారుమారయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాల పాగు నీరు అందుతోందన్నారు. పాలమూరులో కూడా ప్రాజెక్టులు శరవేగంగా సాగుతున్నాయని కేసీఆర్ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ