మంద కృష్ణ అరెస్టుకు కేసీఆర్ మూల్యం చెల్లించక తప్పదు

First Published Dec 26, 2017, 3:33 PM IST
Highlights
  • తెలంగాణ సర్కారుపై విరుచుకుపడ్డ తమ్మినేని
  • టీఆర్ఎస్ నాయకులే కులాల మద్య చిచ్చుపెడుతున్నారని ఆరోపణ
  • కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు దొందు దొందేనని విమర్శించిన తమ్మినేని

తెలంగాణ సర్కారు కులాల మద్య చిచ్చు పెట్టి డ్రామాలాడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆరోపించారు.  ఈ డ్రామాల్లో బాగంగానే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న మంద కృష్ణ మాదిగను అరెస్ట్ చేసి జైళ్లో పెట్టాడని ఆరోపించాడు. ఈ అరెస్టును వామపక్షాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా ఉద్యమాలు , ఉద్యమ నేతలపై అణచివేతలు, నిర్బంధాలు కొనసాగుతున్నాయని, దీనికి కేసీఆర్ మూల్యం చెల్లించక తప్పదన్నారు.  ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణ పై పలు వామపక్ష నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న తమ్మినేని ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. 

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ...తెలంగాణలో గిరిజనులు, ఆదివాసీలు మధ్య ఘర్షణ పెంచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇలా ఘర్షణ వాతావరణాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అందుకోసం తక్షణమే ఆయా సంఘాలతో చర్చలు జరపాలని సూచించారు. ఇందుకోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి వారిమద్య చెలరేగిన గొడవలను తగ్గించాలన్నారు. త్వరలో లంబాడీ, ఆదివాసీ నేతలు, మేధావులతో వామపక్షాలు తరపున  చర్చలు జరిపి వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామని తెలిపారు.


సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్ ,టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, వారి ఈ మాటలు  మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిడుతున్న కాంగ్రెస్, గతంలో వారు  అధికారంలో ఉన్నపుడు ఏం చేశారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ , టిఆర్ఎస్ రెండు పార్టీలు కుల రాజకీయాలకే  పాల్పడుతున్నాయని అన్నారు.   ఓటు బ్యాంకు కోసమే   కాంగ్రెస్ ,టిఆర్ఎస్ ఈ డ్రామాలు ఆడుతున్నాయని తమ్మినేని ఆరోపించారు.
 

click me!