నాడు ఆమ్రపాలి ట్రెక్కింగ్.. నేడు సినిమా షూటింగ్

Published : Dec 26, 2017, 08:57 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
నాడు ఆమ్రపాలి ట్రెక్కింగ్.. నేడు సినిమా షూటింగ్

సారాంశం

పాండవుల గుట్టలో అనువంశికత సినిమా షూటింగ్ సినిమా షూటింగ్ చూసేందుకు భారీగా వచ్చిన జనాలు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం తిర్మలగిరిలోని పాండవులగుట్టల్లో అనువంశికత అనే సినిమా షూటింగ్ జరిగింది. 
ఒకవైపు సినిమా షూటింగ్‌, మరోవైపు రాక్‌క్లైంబింగ్‌ ఉండటంతో ఈ ప్రాంతం సందడిగా మారింది. 
సినిమా షూటింగ్‌ ఉందని తెలుసుకుని చుట్టు పక్కల గ్రామాల నుంచి జనాలు పెద్ద సంఖ్యలో వచ్చి చూశారు. 
ఈ సినిమా నిర్మాత తాళ్లపల్లి దామోదర్‌గౌడ్‌, దర్శకుడు ముక్కేర రమేశ్‌ మాట్లాడుతూ...ప్రేమ కథ ఆధారంగా సినిమా తీస్తున్నామన్నారు. 


పాటలు, యాక్షన్‌ సన్నివేశాలను గుట్టల్లో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. 
కౌండిన్య మూవీస్‌ పతాకంపై తీస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఫంక్షన్‌ వారం పది రోజుల్లో వరంగల్‌లో నిర్వహిస్తామన్నారు.
హీరోగా సంతోశ్‌రాజ్‌, హీరోయిన్‌గా నేహదేశ్‌పాండే నటిస్తునట్లు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో సినిమా విడుదల చేస్తామన్నారు.


గతంలో వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి పాండవుల గుట్టపై ట్రెక్కింగ్ చేయడం ద్వారా ఈ పాండవుల గుట్ట మరోసారి చర్చల్లోకి వచ్చింది. 
ఇప్పుడు సినిమా షూటింగ్ జరపడంతో స్థానికుల్లో పాండవుల గుట్టపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..
KTR Counter to Uttam Kumar Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు| Asianet News Telugu