సీపీఎంతో జనసేన జట్టు: రెండు రోజుల్లో తమ్మినేని, పవన్ చర్చలు

By narsimha lodeFirst Published 9, Sep 2018, 4:27 PM IST
Highlights

మరో రెండు మూడు రోజుల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. తెలంగాణలో  ఈ రెండు పార్టీలు కలిసి చేయాలని ఓ నిర్ణయానికి వచ్చాయి

హైదరాబాద్: మరో రెండు మూడు రోజుల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. తెలంగాణలో  ఈ రెండు పార్టీలు కలిసి చేయాలని ఓ నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు ఇద్దరు నేతలు   పొత్తులపై చర్చించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిరిగానే కలిసి పనిచేయాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి  తమ్మినేని వీరభద్రం జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ కు ఇటీవల లేఖ రాశారు.ఈ లేఖపై  జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చించింది.  సీపీఎంతో కలిసి పనిచేసేందుకు  జనసేన కూడ సానుకూలమని ప్రకటించింది.

ఆదివారంనాడు  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  జనసేన రాజకీయ వ్యవహరాల  కమిటీతో పవన్ కళ్యాణ్ మాదాపూర్ లోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీపీఎంతో పొత్తుల చర్చల విషయమై  చర్చించారు. 

సెప్టెంబర్ 11 లేదా 12 తేదీల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో చర్చించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి.. ఇతర పార్టీలతో కూడ తమ కూటమిలోకి ఆహ్వానించాలా.. తదితర విషయాలపై చర్చించే అవకాశం ఉంది. అయితే సీపీఎంతో పొత్తు విషయమై జనసేన ఇప్పటికైతే సానుకూలంగా ఉన్నట్టు సంకేతాలను పంపుతోంది. 

ఈ వార్తలు చదవండి

పవన్‌తో రెడీ: తెలంగాణలో మహాకూటమికి తమ్మినేని చిక్కులు

తెలంగాణలో పొత్తు: తమ్మినేని లేఖఫై పవన్ కళ్యాణ్ చర్చలు

Last Updated 9, Sep 2018, 4:32 PM IST