కాంగ్రెస్‌తో పొత్తుపై నేడు కీలక భేటీ: సీపీఎం బాటలోనే సీపీఐ

By narsimha lode  |  First Published Nov 3, 2023, 9:39 AM IST

సీట్ల సర్దుబాటు విషయంలో   కాంగ్రెస్ తీరుపై  సీపీఐ  అసంతృప్తితో ఉంది. భవిష్యత్తు కార్యాచరణపై  సీపీఐ వ్యూహరచన చేస్తుంది.  


హైదరాబాద్: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం  శుక్రవారం నాడు హైద్రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరగనుంది.   కాంగ్రెస్ తో పొత్తు విషయమై  ఈ సమావేశంలో చర్చించనున్నారు. పొత్తు విషయంలో కాంగ్రెస్ తీరుపై  సీపీఐ నేతలు అనుమానంతో ఉన్నారు. హస్తం పార్టీ చేయిస్తే  సీపీఎం బాటలో నడవాలని సీపీఐ భావిస్తుంది.  

అదే జరిగితే  ఏఏ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై  సీపీఐ నేతలు ఇవాళ జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తు అవసరం లేదని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.  ఈ విషయమై  బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. కొత్తగూడెం, చెన్నూరు అసెంబ్లీ స్థానాలను సీపీఐకి కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.  అయితే మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆయన తనయుడు  రెండు రోజుల క్రితం  కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో  చెన్నూరు అసెంబ్లీ సీటు కూడ సీపీఐకి కేటాయించకపోవచ్చనే అభిప్రాయం కూడ నెలకొంది.

Latest Videos

undefined

 మరో వైపు కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావుకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. జలగం వెంకటరావు  ఇటీవలనే బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. వెంకటరావు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. దీంతో కొత్తగూడెం సీటు విషయంలో  కూడ సీపీఐకి అనుమానాలున్నాయి.

ఈ పరిణామాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి  నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం  చేశారు.  తమకు కేటాయించే  సీట్ల  విషయమై  మార్పులు చేర్పుల గురించి కాంగ్రెస్ నాయకత్వం నుండి ఎలాంటి సమాచారం లేదని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు  రెండు రోజుల క్రితం  ప్రకటించారు. ఇవాళ్టితో  ఈ రెండు రోజుల గడువు పూర్తైంది.ఇవాళ మధ్యాహ్నం సీపీఐ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ తో పొత్తుపై  ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

also read:కాంగ్రెస్‌తో పొత్తుకు రాంరాం: 17 స్థానాల్లో పోటీ చేస్తామన్న తమ్మినేని

కాంగ్రెస్ తీరుపై అసంతృప్తితో ఉన్న  సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తామని నిన్ననే ప్రకటించింది.  తెలంగాణలో 17 అసెంబ్లీ స్థానాల్లో  పోటీ చేయనున్నట్టుగా  సీపీఎం తేల్చి చెప్పింది.  కాంగ్రెస్ తో పొత్తు లేకపోతే  సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేయనున్నాయి.

click me!