కేసీఆర్ మనసు సముద్రం, ఆలోచన ఆకాశం... ఆయన్ని కొట్టేవారింకా పుట్టలేదు : కవిత

By Arun Kumar P  |  First Published Nov 3, 2023, 9:06 AM IST

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పదేళ్లలో భర్తీ చేసిన ఉద్యోగాల కంటే తెలంగాణలో కేసీఆర్ సర్కార్ భర్తీచేసిన ఉద్యోగాలు చాలా ఎక్కువని... యువత ఈ విషయం గమనించాలని కవిత సూచించారు. 


నిజామాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మహాసముద్రం, ఆలోచన ఆకాశం అంటూ ఆయన కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొనియాడారు. కేసీఆర్ లాంటి మహా నాయకున్ని కొట్టడం ఎవరితరం కాదని... ఆయనను ఆయనే సాటి, పోటీ అన్నారు. రాజకీయంగా కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే మరో కేసీఆర్ పుట్టాలని కవిత అన్నారు. 

నిజామాబాద్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకునే బాధ్యత కవిత తీసుకున్నారు. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ అభ్యర్థుల తరపుర జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇలా బోధన్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థి షకీల్ కు మద్దతుగా నిర్వహించిన మహా యువగర్జన కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువత ఇతర పార్టీల మాయమాటలు నమ్మకుండా బిఆర్ఎస్ కు మద్దతుగా నిలవాలని సూచించారు. 

Latest Videos

ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడంలేదని... ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారంచేస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కవిత అన్నారు. అయితే గత ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఉద్యోగ నియామకాలు... ఈ పదేళ్ళ బిఆర్ఎస్ పాలనలో జరిగిన నియామకాలను పరిశీలిస్తే అన్యాయం చేసిందెవరో అర్థమవుతుందన్నారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పాలిత ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 24వేల ఉద్యోగాల భర్తీ మాత్రమే జరిగిందన్నారు. ఇందులోనూ తెలంగాణ యువతకు వచ్చినవి కేవలం 10వేలు మాత్రమేనని కవిత అన్నారు. 

Read More  తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు 2023: మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు ..

అయితే గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏకంగా 2లక్షల 32 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగిందని... ఇందులో ఇప్పటికే లక్షా 60 వేల ఉద్యోగాల భర్తీకూడా జరిగిపోయిందని కవిత తెలిపారు. ఇంకో 40 వేల ఉద్యోగాల భర్తీప్రక్రియ ఆయా దశల్లో వుందన్నారు. కాబట్టి తెలంగాణ యువతకు కాంగ్రెస్ హయాంలో అన్యాయం జరిగిందా లేక బిఆర్ఎస్  హయాంలో జరిగిందో మీరే తేల్చాలని యువతను కోరారు కవిత. 

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను రేవంత్ రెడ్డి అడ్డా కూలీలతో పోల్చాడని కవిత గుర్తుచేసారు. అలాంటి రేటెంత రెడ్డికి ఉద్యోగాల గురించే మాట్లాడే అర్హత లేదని కవిత అన్నారు.  
 

click me!