బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత: సీపీఐ నేత నారాయణ అరెస్ట్

By narsimha lode  |  First Published Jun 16, 2022, 4:57 PM IST

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన సీపీఐ జాతీయ సహాయ కార్యదర్శి నారాయణ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు.


నిర్మల్: Basara IIIT విద్యార్ధులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన CPI  నేత Narayana ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది.మూడు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు. తమ 12 డిమాండ్లు పరిష్కరించే వరకు తాము ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్ధులు తేల్చి చెప్పారు.

ఇవాళ ఉదయం  నుండి ఆందోళనను ప్రారంభించారు విద్యార్ధులు.. విద్యార్ధులకు మద్దతుగా పేరేంట్స్ కూడా బాసర ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద నిరసనకు దిగారు. ఆందోళన చేసిన పేరేంట్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇదిలా ఉంటే తమ డిమాండ్లపై ప్రభుత్వం చులకనగా మాట్లాడడాన్ని విద్యార్ధులు తప్పు పడుతున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమ డిమాండ్లను సిల్లీ డిమాండ్లు పేర్కొన్నారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. మరో వైపు ఈ వ్యాఖ్యలపై విద్యార్ధుల పేరేంట్స్ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు వచ్చి చూస్తే తమ డిమాండ్లు న్యాయబద్దమైనవో కావో తెలుస్తుందన్నారు.  చర్చలకు పిలిచి జిల్లా అధికారులు తమతో వ్యవహరించిన తీరు సరిగా లేదని విద్యార్ధులు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై విద్యార్ధుల పేరేంట్స్ ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద నిరసనుకు దిగారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Latest Videos

undefined

విద్యార్ధులు ఆందోళనను విరమించాలని ప్రభుత్వం కోరుతుంది. తాము లేవనెత్తిన 12 డిమాండ్లను పరిష్కరిస్తేనే తాము ఆందోళనను విరమిస్తామని కూడా విద్యార్ధులు తేల్చి చెప్పారు.  మరో వైపు విద్యార్ధుల ఆందోళన విషయమై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కూడా కోరారు. అధికారుల దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లనున్నట్టుగా గవర్నర్ చెప్పారు.

also read:బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌గా సతీష్ కుమార్ నియామకం: ఆందోళన కొనసాగుతుందన్న విద్యార్ధులు

వర్షంలో కూడా విద్యార్ధులు ఆందోళన చేస్తున్న విషయమై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ లక్ష్యసాధన కోసం ట్రిపుల్ ఐటీలో చేరారో ఆ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని ఆమె విద్యార్ధులకు సూచించారు.  మీ పేరేంట్స్ కలలు, మీ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని ఆమె విద్యార్ధులను కోరారు. 

వర్షంలో కూడా గొడుగులు పట్టుకొని ఆందోళన చేశారు.  ఆందోళన చేస్తున్న విద్యార్ధులతో జిల్లా  అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రూ. 12 లక్షలను తక్షణమే విడుదల చేస్తామని కూడా అధికారులు ప్రకటించారు. కానీ తాము చేస్తున్న 12 డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ లేదా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి తమకు కచ్చితమైన హామీని ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని ఆందోళనకారులు ప్రకటించారు.

బాసర ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి.  ట్రిపుల్ ఐటీ వద్దకు మీడియా వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వైపు విద్యార్ధులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. 
 

click me!