బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ గా సతీష్ కుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం నియమించింది. అయితే తాము లేవనెత్తిన 12 డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళనను కొనసగిస్తామని విద్యార్ధులు తేల్చి చెప్పారు.
నిర్మల్:Basara Triple ఐటీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ Satish Kumar ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం పై విద్యార్ధులు హర్షం వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో తమ డిమాండ్లను పరిష్కరిస్తేనే ఆందోళనను విరమిస్తామని విద్యార్ధులు తేల్చి చెప్పారు.మూడు రోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు. తాము లేవనెత్తిన 12 డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్ధులు తేల్చి చెప్పారు. తమకుు నీళ్లు రాకుండా అధికారులు నిలిపివేశారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. నీళ్లు లేకుండా క్యాంపస్ లో ఎలా ఉంటామని విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు.
also read:బాసర ట్రిపుల్ ఐటీలో మూడో రోజు విద్యార్ధుల ఆందోళన: పేరేంట్స్ నిరసన, అరెస్ట్
undefined
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు మూడు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. తాము లేవనెత్తిన 12 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్ధులు స్పష్టం చేస్తున్నారు. బుధవారం నాడు రాత్రి 12 గంటల వరకు ఆందోళన కొనసాగించిన విద్యార్ధులు గురువారం నాడు ఉదయం ఆందోళనను ప్రారంభించారు. విద్యార్ధులకు మద్దతుగా పేరేంట్స్ కూడా బాసర ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద నిరసనకు దిగారు. ఆందోళన చేసిన పేరేంట్స్ ను పోలీసులు అరెస్ట్ ేచేశారు. ఇదిలా ఉంటే తమ డిమాండ్లపై ప్రభుత్వం చులకనగా మాట్లాడడాన్ని విద్యార్ధులు తప్పు పడుతున్నారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమ డిమాండ్లను సిల్లీ డిమాండ్లు పేర్కొన్నారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. మరో వైపు ఈ వ్యాఖ్యలపై విద్యార్ధుల పేరేంట్స్ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు వచ్చి చూస్తే తమ డిమాండ్లు న్యాయబద్దమైనవో కావో తెలుస్తుందన్నారు. చర్చలకు పిలిచి జిల్లా అధికారులు తమతో వ్యవహరించిన తీరు సరిగా లేదని విద్యార్ధులు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై విద్యార్ధుల పేరేంట్స్ ట్రిపుల్ ఐటీ ప్రధాన గేటు వద్ద నిరసనుకు దిగారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
విద్యార్ధులు ఆందోళనను విరమించాలని ప్రభుత్వం కోరుతుంది. తాము లేవనెత్తిన 12 డిమాండ్లను పరిష్కరిస్తేనే తాము ఆందోళనను విరమిస్తామని కూడా విద్యార్ధులు తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే ఇవాళ్టి నుండి క్లాసులు నిర్వహించేందుకు సన్నాహలు చేస్తున్నారు. మరో వైపు విద్యార్ధులు మాత్రం ఆందోళనకు దిగారు.
మరో వైపు విద్యార్ధుల ఆందోళన విషయమై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కూడా కోరారు. అధికారుల దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లనున్నట్టుగా గవర్నర్ చెప్పారు.వర్షంలో కూడా విద్యార్ధులు ఆందోళన చేస్తున్న విషయమై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ లక్ష్యసాధన కోసం ట్రిపుల్ ఐటీలో చేరారో ఆ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని ఆమె విద్యార్ధులకు సూచించారు. మీ పేరేంట్స్ కలలు, మీ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని ఆమె విద్యార్ధులను కోరారు.
ఆందోళన చేస్తున్న విద్యార్ధులతో జిల్లా అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రూ. 12 లక్షలను తక్షణమే విడుదల చేస్తామని కూడా అధికారులు ప్రకటించారు. కానీ తాము చేస్తున్న 12 డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.