నాతో దురుసు ప్రవర్తన.. డీసీపీ జోయల్ డేవిస్‌పై ఫిర్యాదుకు సిద్ధమైన భట్టి విక్రమార్క

Siva Kodati |  
Published : Jun 16, 2022, 04:39 PM IST
నాతో దురుసు ప్రవర్తన.. డీసీపీ జోయల్ డేవిస్‌పై ఫిర్యాదుకు సిద్ధమైన భట్టి విక్రమార్క

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్ తలపెట్టిన రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీపీ జోయల్ డేవిస్‌పై ఆయన ఫిర్యాదు చేయనున్నారు.   

రాహుల్ గాంధీపై (rahul gandhi) ఈడీ విచారణను (ed inquiry) నిరసిస్తూ గురువారం తెలంగాణ కాంగ్రెస్ (telangana congress) తలపెట్టిన రాజ్‌భవన్ (raj bhavan) ముట్టడి రణరంగంగా మారింది. వేలాది మంది నేతలు , కార్యకర్తలు రాజ్‌భవన్ వైపు దూసుకురావడం వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడింది. పోలీసులు లాఠీ ఛార్జీ తోపులాటల్లో పలువురు కాంగ్రెస్ నేతలకు తీవ్ర గాయాలయ్యాయి. సీనియర్ నేత , మాజీ మంత్రి శ్రీధర్ బాబు (sridhar babu) చెంప, మెడపై గాయాలయ్యాయి. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి కాలు విరిగింది. ప్రస్తుతం ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోనే వున్నారు. 

మరోనేత చామల కిరణ్ రెడ్డిని పోలీసులు రౌండప్ చేసి కొట్టడంతో ఒళ్లంతా గాయాలయ్యాయి. ఆయన ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు పలువురు మహిళా నేతలకు గాయాలయ్యాయి. మరోవైపు తన హక్కులకు భంగం కలిగించేలా హైదరాబాద్ డీసీపీ జోయల్ డేవిస్ వ్యవహరించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) ఆరోపించారు. డీసీపీపై ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు తన లాయర్‌కు ఫిర్యాదును సిద్ధం చేయాల్సిందిగా చెప్పానని భట్టి వెల్లడించారు. 

Also Read:పోలీసులతో దురుసు ప్రవర్తన:భట్టి విక్రమార్క, రేణుకా చౌదరిలపై కేసు

కాగా.. రాజ్ భవన్  ముట్టడి కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు దురుసుగా వ్యవహరించడాన్ని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకొంది.  డీసీపీ జోయ్ డేవిస్ ను సీఎల్పీ నేత  మల్లు భట్టి విక్రమార్క నెట్టివేశారు. డీసీపీతో భట్టి విక్రమార్క వాగ్వాదానికి దిగారు. అటు రాజ్ భవన్ వైపునకు వెళ్తున్న మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ని (renuka chowdhury) పోలీసులు అనుసరించారు. డోంట్ టచ్ మీ అంటూ రేణుకా చౌదరి పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను రాజ్ భవన్ లోకి వెళ్తే యాక్షన్ తీసుకోవాలన్నారు. తాను కట్టిన పన్నులతో వేసిన రోడ్డుపై నడిస్తే మీకేం అభ్యంతరమని రేణుకా చౌదరి పోలీసులను ప్రశ్నించారు. 

ఓ మహిళా కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో  ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన మహిళా పోలీసులను నెట్టివేశారు రేణుకా చౌదరి. అదే సమయంలో అక్కడే ఉన్న Panjagutta SI  రేణుకా చౌదరికి అడ్డుపడే ప్రయత్నం చేయడంతో ఆమె ఆయనను చొక్కా పట్టుకొని నిలదీశారు. ఈ పరిణామంతో అక్కడే ఉన్న మహిళా పోలీసులు కూడా షాక్ తిన్నారు. వెంటనే ఓ మహిళా పోలీస్ రేణుకా చౌదరి చేయిని పంజాగుట్ట ఎస్ఐ చొక్కా నుండి లాగివేశారు. దీంతో పోలీస్ స్టేషన్ కు వచ్చి కొడతానని రేణుకా చౌదరి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్