బిగ్‌బాస్‌ ఓ బ్రోతల్ షో: సీపీఐ నారాయణ సీరియస్ కామెంట్స్

Published : Sep 15, 2021, 12:04 PM IST
బిగ్‌బాస్‌  ఓ బ్రోతల్ షో: సీపీఐ నారాయణ సీరియస్ కామెంట్స్

సారాంశం

బిగ్‌బాస్ ప్రోగ్రాంపై  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు.  ఈ ప్రోగ్రాం ఓ బ్రోతల్ షో అంటూ ఆయన ఫైరయ్యారు.ఈ విషయమై తాను సుప్రీంకోర్టులో పోరాటం చేస్తానని ఆయన తేల్చి చెప్పారు.


హైదరాబాద్: బిగ్‌బాస్ ప్రోగ్రాం ఓ బ్రోతల్ షో అని సీపీఐ జాతీయ కార్యదర్శి  నారాయణ ఆ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాగ్ కార్యక్రమం ఓ క్యాన్సర్ లాంటిందని నారాయణ అభిప్రాయపడ్డారు.నైతిక విలువలు దెబ్బతినేలా పిల్లల బుర్రలు పాడయ్యేలా ఈ ప్రోగ్రాం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు హైద్రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

నేరాలు పెరగడానికి ఇలాంటి షో లే కారణమౌతున్నాయని  సీపీఐ నారాయణ  చెప్పారు. బయటకే ఇన్ని బూతులు కన్పిస్తున్నాయని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.బిగ్ బాస్ షో లో కన్పించకుండా ఇంకేం జరుగుతుందోనని నారాయణ అనుమానం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ పై హోస్ట్‌గా ఉన్న నాగార్జున ఈ విషయమై ఆలోచించాలని ఆయన కోరారు. 

నాగేశ్వరరావు ఎలాంటి సినిమాలు చేశారు, నాగార్జున ఇలాంటి షోలు చేస్తారా అని నారాయణ ప్రశ్నించారు. కూల్‌డ్రింక్స్ ప్రకటనలు వద్దని గతంలో చిరంజీవికి చెబితే మానేశారని ఆయన గుర్తు చేశారు. బిగ్ బాస్ పై పోరాటం చేస్తానన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తానని నారాయణ తేల్చి చెప్పారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం