జగన్ విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీకి హైకోర్టు నిరాకరణ...

By AN TeluguFirst Published Sep 15, 2021, 11:38 AM IST
Highlights

అక్రమాస్తుల కేసులో జగన్ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు నిరాకరించింది, ఈ మేరకు  పిటిషన్ల  బదిలీ కోరుతూ  రఘురామ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.

బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీకి హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో కాసేపట్లో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. కాగా, అక్రమ ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు  పిటిషన్లను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు  మంగళవారం తెలంగాణ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ లను రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. దీనిపై సీబీఐ కోర్టు రేపు తుది ఆదేశాలు ఇవ్వనుంది.ఈ తరుణంలో  వేరే న్యాయస్థానానికి ఈ పిటిషన్ ను బదిలీ చేయాలని రఘురామకృష్ణం రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అంతేకాదు సీబీఐ కోర్టు రేపు తుది ఉత్తర్వులు జారీ చేయకుండా కూడా ఆదేశాలివ్వాలని కోరారు.ఈ పిటిషన్ పై విచారణను ఇతర క్రిమినల్ కోర్టులకు బదిలీ చేయాలని రఘురామకృష్ణంరాజు ఆ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు.

click me!