కరోనా నివారణపై ఏం చర్యలు తీసుకొన్నారు: తెలంగాణ హైకోర్టు ప్రశ్నలు

By narsimha lodeFirst Published Sep 15, 2021, 11:47 AM IST
Highlights


 కరోనాపై తెలంగాణ హైకోర్టులో  బుధవారం నాడు విచారించింది. కరోనా నివారణపై ఏం చర్యలు తీసుకొన్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.కరోనాపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఇటీవలనే ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.

హైదరాబాద్: కరోనా నివారణపై ఏం చర్యలు తీసుకొన్నారని  తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. బుధవారం నాడు తెలంగాణ హైకోర్టులో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారించింది. గతంలో కూడ కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకొన్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.కరోనాపై ఏర్పాటు చేసిన కమిటీ సూచనలపై తీసుకొన్న చర్యలు ఏమిటని ప్రశ్నించింది ఉన్నత న్యాయస్థానం. స్కూళ్ళు, గణేష్ ఉత్సవాల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

click me!