అమిత్ షాను కలవాల్సిన కర్మ ఎన్టీఆర్‌కేంటీ.. సినిమా వాళ్ల కాళ్లు పట్టుకునేందుకు బీజేపీ యత్నాలు : సీపీఐ నారాయణ

By Siva KodatiFirst Published Sep 1, 2022, 3:38 PM IST
Highlights

బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు సీపీఐ నారాయణ. బీజేపీ సినిమా యాక్టర్స్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. అమిత్ షాను కలవాల్సిన కర్మ జూనియర్ ఎన్టీఆర్‌కు ఏంటని ఆయన ప్రశ్నించారు. క్రిమినల్ అయిన అమిత్ షా దగ్గరికి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వెళ్లాలని నారాయణ నిలదీశారు.

ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాను టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కలవడం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది. దీనిపై పలువురు రకరకాలుగా స్పందించారు. తాజాగా ఎన్టీఆర్ - అమిత్ షా భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఐ నారాయణ. అమిత్ షాను కలవాల్సిన కర్మ జూనియర్ ఎన్టీఆర్‌కు ఏంటని ఆయన ప్రశ్నించారు. క్రిమినల్ అయిన అమిత్ షా దగ్గరికి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వెళ్లాలని నారాయణ నిలదీశారు. బీజేపీ సినిమా యాక్టర్స్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. గుజరాత్ వాళ్లు దేశాన్ని దోచేస్తున్నారని.. బీజేపీ వ్యతిరేక కూటమిని కలిసినందుకు కేసీఆర్‌ను ఆయన అభినందించారు. బీజేపీకి వ్యతిరేకంగా వున్న అన్ని శక్తులను కేసీఆర్ కలవాలని నారాయణ స్పష్టం చేశారు. ఆప్ నాయకుల విషయంలో సీబీఐ .. కొండను తవ్వి ఎలుకని పట్టుకున్నట్లుందని ఆయన చురకలు వేశారు. 

ఇకపోతే... విశాఖలో గత వారం జరిగిన సీపీఐ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నారాయణ, రామకృష్ణ హాజరయ్యారు. సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబుకు అంతర్జాతీయ రాజకీయాలపై అవగాహన లేదన్నారు. బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని.. బీజేపీలో ఎవరు కలిసినా వాళ్లపైనా పోరాటం చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. బీజేపీని వైసీపీ, టీడీపీ పట్టుకుని వెళ్లాడుతున్నాయని ఆయన సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ అటు ఇటుగా వున్నారని.. తోక పార్టీగా చర్చించుకున్న వామపక్షాలే తలనే ఆడిస్తాయని నారాయణ అన్నారు. ఏపీలో విధ్వంసకర రాజకీయం జరుగుతోందని.. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు. 

ALso REad:ఎన్టీఆర్, అమిత్ షా భేటీ.. ఫ్యాన్స్ కి కావాల్సింది అదే, తెరవెనుక ఉన్నది ఎవరో తెలుసా ?

ఈ సందర్భంగా డీ.రాజా మాట్లాడుతూ ఏపీలో ప్రత్యేకమైన రాజకీయ పరిస్ధితులున్నాయన్నారు. ఏపీలో అధికార, విపక్షాలు మోడీ మెప్పు కోసం ప్రత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు సీపీఐ పోరాటం చేస్తోందని డీ.రాజా చెప్పారు. వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు ఏకం కావాలని.. ప్రాంతీయ పార్టీలు ఏకం చేసే బాధ్యత వామపక్ష శక్తులదేనని ఆయన తెలిపారు. 

click me!