
నల్లధనాన్ని నియంత్రించడానికి పెద్ద నోట్ల రద్దు చేసిన కేంద్రం నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అయితే ఈ ఒక్క నిర్ణయం తోనే నల్లధనం బయటకు రాదన్నారు. దేశంలోని కార్పొరేట్ కంపెనీల లూటీని అరికడితేనే నల్లధనం నియంత్రణ సాధ్యమన్నారు. బుధవారం ఆయన తిరుపతిలో మీడియాతో మా ట్లాడారు.
నెల కిందట ఏపీ సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాయడం, కొన్ని రోజుల తర్వాత ప్రధాని అకస్మాత్తుగా ప్రకటన చేయడాన్ని బట్టి ఎన్టీయే పార్టీలు వాళ్ల కొంపలు సర్దుకు న్నాకనే నోట్ల రద్దు ప్రకటన చేసినట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. మోదీ నిర్ణయం వల్ల పేద, చిల్లర వర్తకులకు నష్టం వాటిల్లి పెద్దపెద్ద మాల్స్, వ్యాపార సంస్థలు భారీగా బాగుపడతాయన్నారు. పెద్ద నోట్ల రద్దుతో వివాహాలు, చిన్నచిన్న కార్యక్రమాలకు జనం వెళ్లలేని పరిస్థితులు ఎదురవుతాయన్నారు. ఈ నేపథ్యంలో కొంత కాలం మినహాయింపు ఇవ్వాలన్నారు.