పల్లవి ప్రశాంత్ పై కేసు పెట్టడాన్ని సీపీఐ నారాయణ వ్యతిరేకించారు. ఆయనపై కాదు.. బిగ్ బాస్‌కు యాంకరింగ్ చేసిన నాగార్జునపై కేసు కట్టాలని డిమాండ్ చేశారు.
బిగ్ బాస్ గేమ్‌ను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే, తాజాగా, ఆ బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ వ్యవహారంపై స్పందించారు. పల్లవి ప్రశాంత్‌ను బెదిరించడం కాదు... అసలు బిగ్ బాస్ ఎవరు నిర్వహిస్తున్నారు? ఎవరు యాంకరింగ్ చేస్తున్నారు? వారిపై కేసు కట్టాలని పోలీసులను పేర్కొంటూ కామెంట్ చేశారు.
బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన తర్వాత గొడవలు జరిగాయి. అందుకు సంబంధించి కేసులు అన్నీ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పైనే ఎందుకు? అని ప్రశ్నించారు. పల్లవి ప్రశాంత్‌ను వేధించడం సరికాదని అన్నారు. ఒక వేళ ప్రశాంత్ బలవన్మరణానికి పాల్పడితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు.
నాగార్జునని అరెస్టు చేయండి - సీపీఐ నారాయణ pic.twitter.com/xA8zKQGrUk
— Ramesh MiRa Official (@ramesh_midde)
Also Read : Free Bus: ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎంతమంది ప్రయాణిస్తున్నారో తెలుసా?
ఇందుకు సంబంధించిన వీడియోలో పల్లవి ప్రశాంత్‌ను ఉద్దేశించి సీపీఐ నారాయణ మాట్లాడారు. పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉన్నా.. సీపీఐ కార్యాలయానికి రావాలని సూచించారు. తాము ఆయనకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.