చంద్రబాబు అరెస్టుపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి స్పందించారు. చంద్రబాబును ఏ ఆధారాలు లేకుండా అరెస్టు చేయడాన్ని తప్పుపట్టారు. జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అంశంపై తెలంగాణ నుంచీ కామెంట్లు వస్తున్నాయి. తాజాగా, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి స్పందించారు. చంద్రబాబు అరెస్టును తప్పుబట్టారు. ధర్మం, న్యాయం గెలుస్తుందని వివరించారు.
కరీంనగర్‌లో మీడియాతో చాడ వెంకట్ రెడ్డి మాట్లాడారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి వాస్తవాలు త్వరలో బయటకు వస్తాయని అన్నారు. చంద్రబాబు అరెస్టును భూతద్దంలో పెట్టి చూడొద్దని సూచించారు. చంద్రబాబు అరెస్టును పేర్కొంటూ ఏపీ సీఎం జగన్ పై తీవ్రంగా కామెంట్ చేశారు. ఆయనకు వార్నింగ్ కూడా ఇచ్చారు. జగన్ ఏమీ శాశ్వత ముఖ్యమంత్రి కాదని అన్నారు. ఇవాళ జగన్ చేసిందే.. రేపు చంద్రబాబు చేస్తాడని అన్నారు. చెడపకురా చెడేవు అనే మాట పెద్దలు ఊరికే అనలేదని పేర్కొన్నారు.
Also Read: మేరీ మాటీ, మేరీ దేశ్: పవిత్ర మట్టితో ఢిల్లీ వరకు అమృత కలశ్ యాత్ర: బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి
హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర చాలా కీలకం అని చాడ అన్నారు. ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం సమంజసం కాదని, ఆయన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నదని వివరించారు. ఇలా చేయడం దారుణం అని చాడ ఆగ్రహం వ్యక్తం చేశారు.