
మునుగోడులో నేడు టఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు మనుగోడు ప్రజా దీవెన సభగా పేరు పెట్టారు. సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో సభా వేదికతో పాటు.. మునుగోడు మొత్తం గులాబీమయంగా మారింది. కొద్దిసేపట్లోనే సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరనున్నారు. అయితే సీఎం కేసీఆర్‌తో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా వెళ్లనున్నారు. ఇద్దరు కలిసి ఒకే కారులో మునుగోడుకు చేరుకుంటారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌తో సీపీఐ నేతలు జరిపిన చర్చలు సఫలం కావడంతో.. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్ని కల్లో టీఆర్‌ఎస్‌కే మద్దతివ్వాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
భవిష్యత్తులో కూడా కలిసి పోటే చేసే అంశంపై కూడా చర్చలు సీఎం కేసీఆర్‌తో సీపీఐ నేతలు జరిపినట్టుగా తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతతిశీల శక్తులన్నీ ఏకం కావాలని సీపీఐ కోరుతున్న సంగతి తెలిసిందే. మునుగోడులో సీపీఐ, టీఆర్ఎస్ పొత్తుతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఇక, సీఎం కేసీఆర్.. భారీ ర్యాలీగా హైదరాబాద్ నుంచి మునుగోడుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన సభ వేదిక వద్దకు చేరుకునే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు. ఈ సభకు భారీ జనసమీకరణపై జిల్లా టీఆర్ఎస్ నాయకులు దృష్టి సారించారు. మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుండి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సభా వేదికగా సీఎం కేసీఆర్ మునుగోడు ప్రజలపై వరాలు కురిపిస్తారని, అలాగే ప్రతిపక్షాలను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేసే అవకాశం ఉందని తెలస్తోంది. ముఖ్యంగా కేంద్రంలో అధికార బీజేపీపై కేసీఆర్ విమర్శలను మరింతగా పదును పెట్టే అవకాశం ఉంది.