నాగార్జునసాగర్ బైపోల్: టీఆర్ఎస్ కు సీపీఐ, సీపీఎం మద్దతు

By narsimha lodeFirst Published Apr 12, 2021, 8:42 PM IST
Highlights

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ కు మద్దతివ్వాలని సీపీఐ, సీపీఎంలు నిర్ణయం తీసుకొన్నాయి.
 

హైదరాబాద్:నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ కు మద్దతివ్వాలని సీపీఐ, సీపీఎంలు నిర్ణయం తీసుకొన్నాయి.ఈ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 17వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని సీపీఐ, సీపీఎంలకు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. కానీ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని ఈ రెండు పార్టీలు నిర్ణయం తీసుకొన్నాయి.

also read:దుబ్బాక ఫలితం రీపీటయ్యేనా?: టీఆర్ఎస్,కాంగ్రెస్‌లకు బీజేపీ చెక్ పెట్టేనా?

ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా జానారెడ్డి పోటీ చేస్తున్నారు.  టీఆర్ఎస్ అభ్యర్ధిగా నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్ పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్య ర్ధిగా డాక్టర్ రవికుమార్ బరిలో నిలిచారు.కాంగ్రెస్ పార్టీ లేఖ రాసినా కూడ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని ఈ రెండు పార్టీలు నిర్ణయం తీసుకొన్నాయి.

ఈ ఉప ఎన్నికను మూడు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.  ఈ ఎన్నికల్లో విజయం కోసం మూడు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.ఈ తరుణంలో సీపీఐ, సీపీఎంలు  నోముల భగత్ కు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

click me!