మరదలిపై అనుమానం.. చంపి సంపులో పడేసి.. ఆపై...

Published : Apr 12, 2021, 07:36 PM IST
మరదలిపై అనుమానం.. చంపి సంపులో పడేసి.. ఆపై...

సారాంశం

హైదరాబాద్, కూకట్ పల్లిలో దారుణం జరిగింది. అనుమానంతో ఓ యువతి ప్రాణాలు అర్థాంతరంగా గాల్లో కలిసిపోయాయి. రెండురోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

హైదరాబాద్, కూకట్ పల్లిలో దారుణం జరిగింది. అనుమానంతో ఓ యువతి ప్రాణాలు అర్థాంతరంగా గాల్లో కలిసిపోయాయి. రెండురోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెడితే.. ఓ యువకుడు అనుమానంతో మరదలి గొంతు నులిమి హత్య చేశాడు. హైదరాబాద్ కూకట్ పల్లి పరిధిలోని మూసాపేట్ హబీబ్ నగర్ కు చెందిన సోమేశ్వరరావు నీలమ్మ దంపతుల చిన్న కుమార్తె మంజుల(19). నగరంలో బీటెక్ చదువుతుంది. 

కూకట్ పల్లి ఏవీబీ పురానికి చెందిన ఢిల్లేశ్వరావు చిన్న కుమారుడు భూపతి ఈమెకు వరుసకు బావ అవుతాడు. సమీప బంధువులు కావడంతో పెద్దలు వీరికి వివాహం చేయాలని గతంలోనే నిర్ణయించారు

అయితే కొంతకాలంగా భూపతి, మంజుల తనను దూరం పెట్టి ఇతర యువకులతో సన్నిహితంగా ఉంటోందని అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న ఎవరూ లేని సమయంలో మంజులను తన ఇంటికి పిలిచాడు.

ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ఈ దారుణ ఘటనకు దారి తీసినట్లు తెలుస్తోంది. మాటామాటా పెరగడంతోక్షణికావేశానికి గురైన భూపతి మరదలి గొంతు నులిమి హతమార్చాడు.  ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటి ఆవరణలోని  నీటి సంపులో పడేశాడు.

హోంగార్డు భార్య మర్డర్ కేసు... సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీపైనా చర్యలు: విజయవాడ సిపి...

కాసేపటికి తాను చేసిన పని అర్థమై.. భయంతో తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ధైర్యం చాలక పోవడంతో.. అదేరోజు కూకట్ పల్లి ఠాణాకు వచ్చి లొంగిపోయాడు. ఈ మేరకు సీఐ నర్సింగరావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి