కరోనా పరీక్షలకు వెళ్లి 15 రోజులుగా అదృశ్యం: నరేందర్ సింగ్ కుటుంబసభ్యుల ఆందోళన

By narsimha lodeFirst Published Jun 15, 2020, 12:35 PM IST
Highlights

కరోనా పరీక్షల కోసం వెళ్లిన వ్యక్తి ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హైద్రాబాద్ నగరంలో చోటు చేసుకొంది.


హైదరాబాద్: కరోనా పరీక్షల కోసం వెళ్లిన వ్యక్తి ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హైద్రాబాద్ నగరంలో చోటు చేసుకొంది.

హైద్రాబాద్ పాతబస్తీకి చెందిన ఎస్ఐ రణవీర్ రెడ్డి  ఈ ఘటనకు సంబంధించి వివరాలు మీడియాకు తెలిపారు. ఈ ఏడాది మే 30వ తేదీన కింగ్ కోఠి ఆసుపత్రికి నరేందర్ సింగ్ ను తీసుకెళ్తున్నట్టుగా వైద్యులు తీసుకెళ్లారని కుటుంబసభ్యులు చెప్పారు.

కరోనా లక్షణాలు ఉన్నాయని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.  గాంధీ ఆసుపత్రికి తరలించారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది జూన్ 2వ తేదీన నరేందర్ తమతో మాట్లాడినట్టుగా కుటుంబసభ్యులు చెప్పారు.

అప్పటి నుండి అతని ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉందని కుటుంబసభ్యులు చెప్పారు. అతని కోసం ఇంతవరకు అతని ఆచూకీ లభ్యం కాలేదన్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నరేందర్ గాంధీ ఆసుపత్రిలో చేరలేదని అక్కడి వైద్యులు చెప్పారని పోలీసులు తెలిపారు.

నరేందర్ ఎక్కడికి వెళ్లారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.15 రోజులుగా నరేందర్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండడంతో కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కరోనాతో మరణించాడని మధుసూధన్ అనే వ్యక్తి మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించడం కూడ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ విషయమై మధుసూధన్  భార్య మాధవి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

click me!