తెలంగాణలో కరోనా విలయతాండవం: కేసీఆర్ కీలక నిర్ణయం, హైదరాబాద్‌పైనే ఫోకస్

By Siva KodatiFirst Published Jun 14, 2020, 10:20 PM IST
Highlights

గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా రాజధాని హైదరాబాద్‌లో కోవిడ్ 19 కేసులు విజృంభిస్తుండటం ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది.

గత కొన్ని రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా రాజధాని హైదరాబాద్‌లో కోవిడ్ 19 కేసులు విజృంభిస్తుండటం ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది.

ఈ క్రమంలో ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు, చికిత్స అందించేందుకు సీఎం అనుమతి ఇచ్చారు. ఆదివారం కరోనా నివారణ, లాక్‌డౌన్ తదితర అంశాలపై మంత్రి ఈటల రాజేందర్, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Also Read:ఈటల ఓఎస్డీకి కరోనా: నిన్నా, మొన్నా రాజేందర్‌తోనే ... ఆందోళనలో మంత్రి కుటుంబం

ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు, పరీక్షలకు ధరలను నిర్ణయించాల్సందిగా కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున కేసులు వెలుగు చూస్తుండటంతో అక్కడ విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు.

30 నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. లక్షణాలు లేని వారికి ఇంట్లోనే చికిత్స అందించాలని కేసీఆర్ సూచించారు.

Also Read;తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా

బాధితులకు చికిత్స అందించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, రాష్ట్రంలో ఎంతమందికైనా చికిత్స అందించేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు, పడకలు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు సరిపడా ఉన్నాయని సీఎం తెలిపారు. 

click me!