హైదరాబాద్‌లో యూకే రిటర్న్స్‌ 15 మంది కరోనా..! నెగెటివ్ వచ్చిన 72 గంటలకు పాజిటివ్.. !

Published : Jan 27, 2021, 12:01 PM IST
హైదరాబాద్‌లో యూకే రిటర్న్స్‌ 15 మంది కరోనా..! నెగెటివ్ వచ్చిన 72 గంటలకు పాజిటివ్.. !

సారాంశం

ఓ వైపు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుంటే.. మరోవైపు కొత్త కేసులు బయటపడుతున్నాయి. కరోనా వైరస్‌ టెన్షన్‌ తగ్గనేలేదు.. కొత్త స్ట్రెయిన్‌ టెన్షన్‌ కూడా ఉంది.. ఇదే సమయంలో.. బ్రిటన్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రయాణికుల్లో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా రావడంతో కలకలం సృష్టిస్తోంది. 

బ్రిటన్ నుంచి హైదరాబాద్‌‌కు ఇప్పటి వరకు 5 విమానాలు రాగా, అందులో వచ్చిన వారిలో 15 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో.. వారు కూర్చున్న సీట్లకు ముందు, వెనక మూడు వరుసల్లోని ప్రయాణికులను కూడా క్వారంటైన్‌లో పెట్టారు అధికారులు.

బ్రిటన్‌లో విమానం ఎక్కడానికి 72 గంటల ముందు కరోనా టెస్టు చేయించుకున్నా ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగటివ్ వచ్చిన ప్రయాణికులకు కూడా ఇక్కడ దిగిన తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది.

దీంతో.. పాజిటివ్‌ వచ్చిన ప్రయాణికులతో కలిసి ప్రయాణించిన మరో 300 మందిని క్వారంటైన్‌ లో ఉండాలని అధికారులు సూచించారు. 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి ఎక్కడి వరకంటే.?
TSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 1 నుంచి త‌గ్గ‌నున్న బ‌స్సు ఛార్జీలు. డీపోల‌కు స‌ర్క్యూల‌ర్ జారీ